ప్రజాసమస్యలపై చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయోగశాల లాంటివి ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సభలు. తద్వారా అభివృద్ధి సాధించే విధంగా ప్రతి ప్రాంతాన్ని సిద్ధం చేయడం అక్కడ జరిగిపోతుంది. ఇది అసలు ఆయా సభల ముఖ్య ఉద్దేశ్యం. కానీ ఈ ఉద్దేశ్యం ఎప్పుడో మంటగలిసిపోయింది. సినిమాలలో చూపించినట్టు అందాం అనుకుంటే, వాళ్ళు చూపించేది ఈ సమావేశాలలో జరిగేదే. అందుకే ప్రారంభం నేతల చేష్టలతో అనే చెప్పాలి. ఒక వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం నశించిపోయినప్పుడు అసలు దానితో అవసరం కూడా లేనట్టే అని అర్ధం వచ్చేస్తుంది. కానీ ఇంకా ఆయా సభలు ఉన్నాయి, ప్రతిసారి దానిలో నేతలు ఆయా సమస్యలను లేవనెత్తుతున్నారు అన్న విషయం వరకు బాగానే ఉంటుంది. కానీ శృతిమించి అడ్డగోలుగా అదే పనిగా సమస్యలను ఎత్తి చూపడం తప్ప, పరిష్కారాలు కనుగొనే ఉద్దేశ్యం మాత్రం ఎవరిలోనూ కనిపించడం లేదు.

ఎంతసేపు అధికార ప్రకాశాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం తప్ప, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏమేమి మార్గాలు మన ముందు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏమిటి, అలాగే ఇప్పటి అనుకూల పరిస్థితికి పనికివచ్చే అంశాలు ఆయా రాష్ట్రాలలో ఏమేమి ఉన్నాయి అని ఎవరూ మాట్లాడారు. అసలు మాట్లాడాల్సినవి అవి. అవి తప్ప కొట్టుకోవడం, తిట్టుకోవడం, అది సభ అని మరిచిపోయి, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అందరికి ఇటీవల బాగా అలవాటు అయిపోయింది. ప్రజలకు ప్రస్తుతం ఉన్న అవకాశాలను విపులంగా చెప్పుకునే అవకాశం కూడా ఈ సభల ద్వారా కుదురుతుంది. ఆ మేరకు ప్రజలు ఏఏ విషయాలకు సిద్ధంగా ఉండాలి, తమ వద్ద ఉన్న వనరులు ఏమిటి, ఏవి కొరత ఉన్నాయి. కొరత దేశంలో ఉందా ఆయా రాష్ట్రాలలో ఉందా అని తెలుసుకొని, కొరత ఉన్న ప్రాంతాలను, వనరులు ఉన్న ప్రాంతాలలో అనుసంధానం చేయడం ద్వారా పూర్తి ఫలితాలను పొందే అవకాశం ఎంత ఉంది. ఇలాంటివి చర్చించి, ప్రజలతో చెప్పాల్సినవి చెప్పి, వారి సహకారం కోరడం ఇక్కడ జరగాల్సిన అసలు తంతు.

అనంతరం సభల తరువాత ప్రాంతీయ నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఆయా సభ లలో చర్చించినవి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి, తదుపరి మెట్టు నుండి ప్రణాళికలను అమలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా అగ్ర నాయకత్వం నుండి కిందిస్థాయి నేతల వరకు పాటించాల్సిన అంశాలు. ఇలా జరగకుండా, మీకు ఇచ్చారు కదా అని, లేదా సభలో రాగలిగాం కాబట్టి దానిలో నానా యాగీ చేసి, నాలుగు ఫోటోలు దిగి, పది విమర్శలు చేసి వెళ్ళిపోడానికి ఇప్పటి పరిస్థితి సాధారణమైనది కాదు. దయచేసి మేలుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: