భారతదేశాన్ని ప్రస్తుతం ప్రపంచం అంతా స్వాగతిస్తుంది. దేశంపై ప్రగాఢ విశ్వాసం వాళ్లలో ఏర్పడింది. దానికి తగిన విధంగా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ, దేశాన్ని ముందుకు అడుగులు వేసేవిధంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి, ఎవరికి వారు మోకాళ్ళు అడ్డుపెడుతున్నారు. ఇలాంటి సందర్భం మళ్ళీ మళ్ళీ రాదు. గతంలో ఇలాంటి సందర్భం ఒకసారి వస్తే, దానిని మరో దేశం తన్నుకొని పోయిన విషయం అందరికి తెలిసిందే. అంటే అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడే అవకాశం వచ్చింది. దీనిని ఎవరి స్వార్థం కోసమో పక్కకు పెట్టేస్తే ఆ నష్టం ఎంత ఘోరంగా ఉంటుందో మోకాలు అడ్డుపెట్టే వాళ్లకు తెలియకపోవచ్చు, అభివృద్ధి కోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురుచూసిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది.

ఇప్పటికి కూడా కొందరు వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసమే పని చేస్తూ, దేశానికి వచ్చిన అవకాశాన్ని ప్రజల కు తెలియకుండానే కనుమరుగు చేయాలని చూస్తున్నారు. అది ఎంత ఘోరం. పొరపాటున ఇది ప్రజలు తెలుసుకుంటే, ఆయా పార్టీల గతి ఏమిటి అనేది కూడా వాళ్లకు అర్ధం కావడం లేదు. వాళ్ళ స్వప్రయోజనాలు ఏవైనా కావచ్చు, అది దేశాభివృద్ధిని అడ్డుకోవడం మాత్రం నిజంగా చాలా ఘోరం. అలాంటి వారికి తోడుగా ఉండే వాళ్ళు కూడా ప్రస్తుతం కాస్త మెరుగ్గా ఉండొచ్చుగాక, భవిష్యత్తులో వాళ్ళ వెనుక ఉన్నవాళ్లు కొట్టుకుపోతే, అందులో వీళ్లు పోవాల్సి వస్తుంది. దానిని గమనించుకొని ధర్మం వైపు ఉండటం అలవాటు చేసుకుంటే బాగుంటుంది.

అవకాశాలు వచ్చేదే ఎప్పుడో ఒకసారి, ఆ సమయంలో కూడా ఇలాంటి పనికిమాలిన వాళ్ళు తయారవడం శోచనీయం. ఇంటిదొంగను ఈశ్వరుడైన కనుగొనలేరని అన్నట్టుగా ప్రస్తుతం కొందరు ప్రజల కళ్లుగప్పటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్లకు చేతనైనట్టుగా జవాబు ఇస్తారు. అప్పుడు తెలుస్తుంది తాము చేసిన తప్పేంటి ఘోరమైనదో అని. అయినా చేయి కాలాక ఆకులు పట్టుకున్న చందం కంటే ముందస్తుగా జాగర్తగా ఉండటం మేలు. అంటే తప్పు జాగర్తగా చేయమని కాదు, దేశానికి వచ్చిన అవకాశాన్ని అందరు కలిసి సద్వినియోగం చేసుకునేట్టుగా పని చేయాలని. జాతీయ భావాన్ని ఒక్కసారి తట్టండి, ఈ ఒక్కసారికి. ఎందుకంటే, రేపటి భారతంలో మీ తరాలు కూడా జీవిస్తాయి, వాళ్ళు అభివృద్ధి ఫలాలు ఆస్వాదిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: