మైక్రో బ్లాగింగ్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ సీఈఓ ప‌ద‌వీ నుంచి జాక్ డోర్సీ వైదొలిగారు. దీంతో నూత‌న సీఈఓగా కంపెనీ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితులు అయ్యారు. అయితే గ‌త సంవత్సరం నుండే డోర్సీని సీఈఓగా వైదొలిగే అవకాశం ఉందని ట్విట్ట‌ర్ బోర్డు సిద్ధప‌డింది.  ఈ త‌రుణంలోనే  ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  జాక్ డోర్సే తన పదవీకి రాజీనామా చేసారు. త‌న రాజీనామాపై ట్వీట్ చేస్తూ ఓ లేఖ‌ను జ‌త చేసారు. ట్విట్ట‌ర్‌తో త‌న‌కు ఉన్న 16 ఏండ్ల అనుబంధాన్ని ఆ లేఖ‌లో వివ‌రించారు.

అత‌ని స్థానంలో ట్విట్ట‌ర్ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ గా ఉన్న ప‌రాగ్ అగ‌ర్వాల్ కొత్త సీఈఓగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ట్విట్ట‌ర్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కునేందుకు గ‌త సంవ‌త్స‌రంలో అనేక ఆవిష్క‌ర‌ణ‌లు చేసిన త‌రువాత ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, టిక్‌టాక్ వంటి ప్ర‌త్య‌ర్థుల‌తో మార్కెట్ లో ఉండ‌టానికి 2023 నాటికి దాని వార్షిక ఆదాయాన్ని రెట్టింపు చేసే ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి ట్విట్ట‌ర్ నూత‌న చ‌ర్య‌లు తీసుకుంది. అయితే డోర్సీ  త‌న రాజీనామాకు జ‌త చేసిన లేఖ‌లో.. కంపెనీలో ఎన్నో ప‌ద‌వుల‌ను నిర్వ‌ర్తించాను అని పేర్కొన్నారు. తొలుత స‌హ వ్య‌వ‌స్థాప‌కుడి నుంచి సీఈఓ పాత్ర వ‌ర‌కు పోషించాను అని వెల్ల‌డించారు.  చైర్మ‌న్ ప‌ద‌వీ, ఆ త‌రువాత ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ ప‌ద‌వీతో పాటు దాదాపు 16 ఏండ్ల కాలం వ‌ర‌కు సీఈఓగా ప‌ని చేసాన‌ని గుర్తు చేసారు. ప్ర‌స్తుతం కంపెనీకి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చిన‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. నా వార‌సుడు ప‌రాగ్ అగ‌ర్వాల్ నూత‌న సీఈఓ అవుతాడ‌ని పేర్కొన్నాడు జాక్ డోర్సీ.

అయితే ప‌రాగ్ అగ‌ర్వాల్ ఎప్పుడూ ఈ పేరు పెద్ద‌గా వినిపించ‌నే లేదు. సెన్ష‌న‌ల్ ట్వీట్ ఎంత వేగంగా వైర‌ల్ అవుతుందో.. ఇప్పుడు ఈ పేరు, అత‌ని ఫోటో కూడా అంతే వేగంగా నిమిషాల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అంతే వైర‌ల‌య్యాయి. ఎందుకంటే ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు వ‌చ్చిన ప్ర‌మోష‌న్ అలాంటిది. భార‌తీయ సంత‌తికి చెందిన ప‌రాగ్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ సంస్థ‌కు సీఈఓగా నియ‌మితుల‌య్యారు. ట్విట్ట‌ర్ నిర్ణ‌యం వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే   భార‌త్‌కు చెందిన ప‌రాగ్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారు మోగింది.  ట్విట్ట‌ర్ సీఈఓ బాధ్య‌త‌ల నుంచి డోర్సె త‌ప్పుకోవ‌డంతో ఆయ‌న స్థానంలో ప‌రాగ్ అగ‌ర్వాల్ వ‌స్తున్నాడు అని ఉద్యోగులంద‌రికీ మెయిల్ చేశారు. ప‌రాగ్ త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వాడ‌ని, సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేసాడ‌ని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వంటి సంస్థ‌ను న‌డిపించే స‌త్తా ప‌రాగ్‌లో ఉంద‌ని చెప్పాడు జాక్ డోర్సె.

 
ప‌రాగ్ అగ‌ర్వాల్ బాంబే ఐఐటీలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌ద‌వాడు. అమెరికా వెళ్లి స్టాన్‌ఫోర్ట్ యూనివ‌ర్సిటీలో 2011లో  పీహెచ్‌డీ చేశారు. ఆ స‌మ‌యంలో మైక్రోసాప్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహుల‌లో రీసెర్చ్ చేసాడు. 2011లోనే ట్విట్ట‌ర్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు ప‌రాగ్‌. 2018లో ఆ సంస్థ చీఫ్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. సంస్థ‌లో చేరిన ప‌దేళ్ల కాలంలోనే సీఈఓగా బాధ్య‌త‌లు తీసుకొని రికార్డు సృష్టించారు ప‌రాగ్‌. ఆయ‌న విద్యాబ్యాసం, ప‌రిశోధ‌న‌లు ఇన్నాళ్లు చేసిన బాధ్య‌త‌ల‌న్నింటిని ట్విట్ట‌ర్ ప్ర‌క‌టించింది. ట్విట్ట‌ర్ టెక్నిక‌ల్ స్టాట‌జీ,  ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కంజ్యూమ‌ర్‌, రెవెన్యూ, సైన్స్ టీమ్‌ల‌లో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఇప్పుడు  తాజాగా మొత్తం ట్విట్ట‌ర్ బాధ్య‌త‌ల‌ను త‌న చేతుల్లోకి తీసుకున్నారు ప‌రాగ్‌.   మొత్తానికి టెక్ వ‌ర‌ల్డ్  భార‌త్ నుంచి మరో వ్య‌క్తి సీఈఓగా అవ్వ‌డం ఆస‌క్తిక‌రం.

మరింత సమాచారం తెలుసుకోండి: