భారతీయ జనతా పార్టీ కేరళ ఎప్పుడూ కొరకరాని కొయ్య గానే ఉంది. దేశంలోని అనేక  రాష్ట్రాల్లో కమలం పార్టీ విజయవంతంగా చొచ్చుకుపోయిన, దేవభూమిగా పిలిచే కేరళలో మాత్రం తన పట్టు  సాధించలేక పోతుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకుంది బిజెపి. కానీ ఆ తర్వాత సీటు రాలేదు కానీ ఓటు శాతం బాగా పెంచుకో  కలిగింది. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పరచడం ఓటు షేర్ పెంచుకుంది. ఇలా పెరిగిన ఓటు శాతం పై బోలెడు ఆశలు పెట్టుకొని, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే కమలనాథుల ప్రయత్నాలు ఎన్నికల్లో ఫలించలేదు. బిజెపికి ఒక్క సీటు కూడా దొరకలేదు.నెమమ్ సెగ్మెంట్లోనూ ఓటమిని చవిచూసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఉండి కూడా కేరళలో ఒక్క సీటు కూడా రాలేకపోవడం బిజెపి నాయకులు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

 బిజెపికి శాఖలోని ముఠాల కుమ్ములాటనే ఈ యొక్క గోర పరాజయానికి కారణం అని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లు గెలుస్తుందని  అందరూ భావించారు. దేశవ్యాప్తంగా సిపిఎం ఎదురు గాలి వీస్తున్న కాలంలో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. త్రిపురలో మాత్రం సిపిఎం ఓడిపోయింది. పశ్చిమబెంగాల్లో సిపిఎం నాయకత్వాన  లెఫ్ట్ ఫ్రంట్  ఊసే లేకుండా పోయింది. దేశంలో ఒక్క కేరళలోనే సిపిఎం అధికారంలో ఉంది. అయితే పోలింగ్ కొన్ని నెలల ముందు వెలుగుచూసిన గోల్డ్ స్కామ్ ఏకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. బంగారం కుంభకోణాల్లో పనిలో విజయం సంబంధాలున్నాయని ఆరోపణలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో దుమారం రేపాయి. దీంతో ఎన్నికల్లో సిపిఎం దెబ్బతింటుందని అందరూ భావించారు.  దీనికితోడు కేరళలోని శబరిమల ఆలయ వివాదం  బిజెపి పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బీజేపీ ఎలాగైనా కేరళలో తిష్ట వేయాలని వ్యూహాలు రచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: