భారత్లో కరోనా వైరస్  ఎంత అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మొదటి దశ కరోనా వ్యాప్తి ముగియగానే రెండవదశ కరోనా వైరస్ కూడా దూసుకువచ్చి విపత్కర పరిస్థితులను తీసుకువచ్చింది. ఇలా రెండవ దశ విజృంభిస్తున్న సమయంలో భారత్లో ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొంటాయా అనీ అందరూ ఆందోళన చెందారు. ఇలాంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీంతో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది.


 అయితే మరికొన్ని రోజుల్లో మూడో దశ కరోనా వైరస్ ముంచుకొస్తుందని అటు వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇక కరోనా వైరస్ తో పోరాటానికి వ్యాక్సిన్ ఒక్కటే సరైన మార్గమని భావించి అందరూ వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వచ్చారు. దీంతో ప్రస్తుతం దాదాపుగా అందరూ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అని చెప్పాలి. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మాత్రం టీకా విషయంలో భయాందోళనలతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తూ ఉంటే టీకా వేసుకోవడానికి మాత్రం భయంతో పరుగులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్ వేసుకోవాలి అంటూ వైద్య అధికారులు కోరగా టీకా వేసుకున్న తర్వాత తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటూ హామీ పత్రం ఇస్తేనే తాను టీకా  వేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు సదరు యువకుడు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ధార్వాడ కు చెందిన ఆనంద్ కుమార్ ఇలా డిమాండ్ చేశాడు. జిల్లాలో  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కలెక్టర్ స్థానికులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వింత డిమాండ్ ఎదురైంది. యువకుడు కరోనా వైరస్ టీకా వేసుకుంటే తనకు ఏమీ కాదు అన్న గ్యారెంటీ ఇస్తే తాను వ్యాక్సిన్ వేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు యువకుడు చేసేదేమీ లేక హామీ పత్రాన్ని ఇచ్చారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: