గత కొంత కాలం నుంచి చిన్న దేశమైన తైవాన్ ను తమ దేశాల్లో భూభాగంగా ఓట్లు మార్చుకోవాలని వన్ చైనా పాలసీని తో ముందుకు సాగుతుంది చైనా ప్రభుత్వం. అయితే తైవాన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ దేశాలు చైనా తీరును తప్పుబడుతూ ఉన్నప్పటికీ చైనా మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. రోజురోజుకి చైనా విస్తరణ వాద ధోరణితో ముందుకు సాగడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పాలి.  అమెరికా తైవాన్ జోలికి రావద్దు అంటూ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ చైనా తీరులో వార్తలు రావడం లేదు.


 ఇటీవల తైవాన్ గగనతలం లోకి భారీగా యుద్ధ విమానాలను పంపి చైనా ప్రభుత్వం సంచలనం సృష్టించింది. ఒక రకంగా తైవాన్ చైనా మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుందో తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కాస్త సైలెంట్ గానే ఉన్నట్లు కనిపించిన చైనా ఇక మరోసారి దాష్టీకానికి ఒడిగట్టింది. మరోసారి తైవాన్ గగనతలం లోకి భారీగా యుద్ధ విమానాలను పంపించింది. ఏకంగా చైనాకు చెందిన 27 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలో కి వెళ్ళాయి. దాదాపు గంటపాటు తైవాన్ గగనతలంలో నే చైనాకు చెందిన 27 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం గమనార్హం.



ఇక ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలోనే అప్రమత్తమైన తైవాన్ రక్షణశాఖ  వారి యుద్ధ విమానాల ద్వారా వార్ సిగ్నల్స్ ఇస్తూ  చైనా యుద్ధ విమానాలను తరిమికొట్టడానికి వచ్చాయి. దీంతో చైనాకు చెందిన యుద్ధ విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా మళ్ళీ తిరిగి వెళ్ళి పోయినట్లు తెలుస్తోంది.  ఇలా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 150కి పైగా యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలో కి పంపి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా ప్రయత్నిస్తోంది.  కానీ తైవాన్ మాత్రం యుద్ధానికి సిద్ధం అన్న సంకేతాలనుఅడుగడుగున ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: