మూడు ద‌శ‌ల్లో క‌రోనా జీవితాల‌ను ఛిద్రం చేసింది. ఎంద‌రినో అనాథ‌ల‌ను చేసింది. ఫ‌లితంగా ప్ర‌భుత్వాలు ఆదుకోవాల్సిన త‌రుణం ఉన్నా, ఆవ‌శ్య‌క‌త ఉన్నా ఆర్థికంగా వెన్నుద‌న్ను ఇవ్వ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో మార్కెట్ శక్తులు రెచ్చిపోయి రంకెలేస్తున్నా యి. ఇప్పుడు కొత్త ర‌కం క‌రోనాతో మార్కెట్ లో మ‌ళ్లీ అల‌జ‌డులు రేగుతున్నాయి. ఆర్థికంగా కుదేల‌యిన భార‌తావ‌నికి కొత్త ర‌కం వేరియంట్ మ‌రో కొత్త స‌మ‌స్య‌ను తెచ్చిపెట్ట‌డం ఖాయం.


వ్యాధి నిర్థార‌ణ నుంచి వ్యాధి నిరూపణ వ‌ర‌కూ క‌రోనా విష‌య‌మై ఇప్ప‌టికీ ఎన్నో అపోహ‌లు ఎన్నో అనుమానాలు. వ్యాధి నిర్థార‌ణ‌కు సంబంధించి అనేక ద‌శ‌ల్లో టెస్టింగ్ కిట్లు వ‌చ్చి కాస్తో కూస్తో మ‌న దేశాన్ని ఆదుకున్నాయి. వ్యాధి ప్రాథ‌మిక ద‌శ‌లో  కొన్ని టెస్టులు వ‌చ్చిన‌ప్ప‌టికీ అవ‌న్నీ వ్యాధి నిర్థార‌ణ‌కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. తరువాత వ‌చ్చిన ప‌ద్ధ‌తులు క‌రోనా నిర్థార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఆర్టీపీసీఆర్ విధానంలో వ్యాధి నిర్థార‌ణ‌కు సంబంధిత ప‌రీక్ష‌లు చేస్తున్నారు.  ఏదేమ‌యిన‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా చాలా వ్యాపారం పుంజుకుంది. ఆయుర్వేదం, అల్లోప‌తి ప‌ద్ధ‌తుల్లో వ్యాధిని త‌గ్గించేందుకు ఎన్నో మందులు అందుబాటులోకి వ‌చ్చాయి. తొలి రోజుల్లో  వైద్య రంగంలో్ సేవ‌లందించే వారికి పీపీఈ కిట్లు అవ‌స‌రం అయినా కావాల్సినంత దొరికేవి కావు. కానీ ఇప్పుడు ఆ స‌మ‌స్య లేకుండా పోయింది. కొన్ని పీహెచ్సీ సెంట‌ర్ల ప‌నితీరు కార‌ణంగా గ్రామాల్లో కూడా  క‌రోనా టెస్టులు బాగానే జ‌రిగాయి. ప్ర‌భుత్వాలు కూడా బాగానే అప్ర‌మ‌త్తం అయి వైద్య సాయం అందించాయి. కానీ ఇప్పుడు మూడో వేవ్ ప్ర‌భావం ఉండ‌నుంద‌ని తెలియ‌డంతో అంద‌రికీ గుండెల్లో రైళ్లు ప‌రుగులు తీస్తున్నాయి. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న  అనుమానం ఉంది. ఆందోళ‌నా ఉంది.

ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల్లో క‌రోనా ప్ర‌పంచాన్ని చుట్టేసింది. ప్ర‌పంచాన్ని చుట్టేసింది అనే క‌న్నా ప్ర‌పంచాన్ని మింగేసింది అని అనాలి. అందుకే క‌రోనా కు విరుగుడు కనుగొనే ప్ర‌య‌త్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అయితే చైనా నుంచి ప్ర‌పంచ దేశాల‌కు సంక్ర‌మించిన ఈ వ్యాధి పై కొన్ని అపోహ‌లు ఉన్నాయి. వీటినే ఆధారంగా చేసుకుని మార్కెట్ శ‌క్తులు రెట్టింపు లాభాలు ఆర్జిస్తున్నాయి. శానిటైజ‌ర్, మాస్క్ ల వ్యాపారం రెండు ద‌శ‌ల్లోనే బాగానే జ‌రిగినా త‌రువాత కాస్త వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో
ఎక్క‌డి అమ్మ‌కాలు అక్క‌డే నిలిచాయి. దీంతో వ్యాపార శ‌క్తులు నిరుత్సాహ‌ప‌డ్డాయి. ఇదే స‌మ‌యంలో మ‌రో వేవ్ వ‌స్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్ప‌డంతో ఇప్పుడిక మ‌ళ్లీ వ్యాపార‌వర్గాల‌కు పండుగే!

ఇంకా చెప్పాలంటే...
క‌రోనా అనే మూడ‌క్ష‌రాలు చుట్టూ మార్కెట్ తిరుగుతోంది. ఆ మాడ‌క్ష‌రాల చుట్టూ తుఫాను రేగుతోంది. ఆ మూడ‌క్ష‌రాలే అనేక ఆర్థిక సంక్షోభాల‌కూ కార‌ణం అవుతోంది. అందుకే క‌రోనా అంటే భ‌య‌ప‌డి చ‌చ్చేది. దేశాలు కూడా కొట్టుకు చ‌చ్చేది అందుకే. మొద‌ట్లో ఎవ్వ‌రికీ అర్థం కాని జ‌బ్బులా ఇది ఉన్నా త‌రువాత త‌రువాత వివిధ ప‌రిశోధ‌న‌ల ద‌శ‌లో ఈ రోగం ల‌క్ష‌ణాలు, వాటి నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు ఇలా అన్నింటినీ తెలుసుకోగ‌లిగారు. వ్యాధి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కూడా ప‌రిశోధ‌కులు వెల్ల‌డిచేశారు. అదేవిధంగా కొన్ని ప‌రిశోధ‌న ఫ‌లితంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ అవి అందిస్తున్న ఫ‌లితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో మార్కెట్లో వాక్సిన్ వ్యాపారం కూడా బాగానే ఉంది. అందుకు త‌గ్గ రీతిలో వ్యాధి నియంత్ర‌ణ లేద‌న్న‌ది ఓ చేదు నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: