ఆంధ్రప్రదేశ్ లో 2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో అధికారంలోకి రావటానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అప్పటి టిడిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తో పాటు జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నిర్ణయం తీసుకోవటం... దీనికితోడు బీహార్‌కు చెందిన రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ గెలుపు లో ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు - టిడిపి వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియా కూడా జగన్ కు బాగా కలిసొచ్చింది.

దీనికి తోడు చాలా నియోజకవర్గాల్లో కొత్త నేతలు పోటీ చేయడం వల్ల కూడా వైసీపీలో వాళ్ళందరూ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఏపీలో మరో రెండున్నర సంవత్సరాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జగన్ 151 మంది ఎమ్మెల్యేల లో 70 మంది ఎమ్మెల్యేలను ఈ సారి కచ్చితంగా టిక్కెట్లు ఇవ్వ‌ర‌ని పార్టీ అధిష్టాన‌మే అంటోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని... ఇప్పటికే జగన్ కు ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా ఇచ్చింద‌ని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వచ్చే సంక్రాంతి తర్వాత ప్రశాంత్ కిషోర్ ముందుగా రంగంలోకి దింపి ఎమ్మెల్యేల పనితీరుపై స‌ర్వే చేయాల‌ని అనుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా చేయడానికి ఏం లేకుండా పోయింది ఈ నేపథ్యంలోనే మరో ఐదారు నెలలు వారికి సమయం ఇచ్చి చూడాలని జగన్ భావిస్తున్నారట. ఆ తర్వాత పీకే టీంను రంగంలోకి దింపి వారి పనితీరు పై సర్వేలు చేస్తారని తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీ ఎంట్రీకి సమయం పడుతుందని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పశ్చిమబెంగాల్లో ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే అక్కడ పికే టీం రంగంలోకి దిగి పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసి కొత్తవారిని రంగంలోకి దింపింది. అందుకే మమతాబెనర్జీ అంచనాలకు మించి సీట్లు సాధించి.. వరుసగా మూడోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ కోసం కూడా అదే ప్లాన్ చేస్తోన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: