న‌వంబ‌ర్ ముగిసి డిసెంబ‌ర్ నెల రేప‌టి నుంచి రానున్న‌ది. అయితే కొత్త నెల‌తో పాటు కొత్త రూల్స్ కూడా అమ‌లులోకి రానున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర,  ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకింగ్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఇలా అనేక అంశాలకు డిసెంబర్‌లో అమలులోకి రాబోయే కొత్త రూల్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

ఎస్‌బీఐ ఛార్జీలు, ఈపీఎఫ్ ఆధార్ లింకింగ్, ఎల్‌పీజీ ధర, పెన్షనర్స్ జీవన్ ప్రమాణ పత్రం, ప్రత్యేక రైళ్లు వంటి వాటికి  ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నవారికి డిసెంబర్ 1 నుంచి ఇక  షాక్ తప్పదనే చెప్ప‌వ‌చ్చు.  ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్‌బీఐ ఇప్ప‌టికే  ప్రకటించింది. ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు రేపు అన‌గా 2021 డిసెంబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.

అదేవిధంగా అగ్గిపెట్ట ధర కూడా పెర‌గ‌నున్న‌ది.  14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం ఒక్క రూపాయి ఉన్న అగ్గిపెట్టె కొనడానికి ఇకపై రెండు రూపాయలు చెల్లించాలి. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే.. రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండ‌బోనున్నాయి. ఇక‌ డిసెంబర్ 1 నుంచే  నూత‌న ధరలు అమలులోకి రానున్నాయి. ముడిసరుకు, తయారీ ఖర్చు పెరగడమే అగ్గిపెట్టె ధర పెరగడానికి కారణం అని పేర్కొంటున్నారు.

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. ప్రస్తుతం 2.90 వార్షిక వడ్డీ ఇస్తున్న‌ది పంజాబ్ నేషనల్ బ్యాంక్. 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతం వడ్డీ వర్తించ‌నుంది. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ మాత్ర‌మే లభిస్తుంది.

అకౌంట్ ఉన్నవారంతా తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు  ఆధార్ నెంబర్‌ను లింక్ త‌ప్ప‌కుండా చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1 లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన  విష‌యం విధిత‌మే.  అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందేన‌ని, లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్‌లో యజమాని వాటా జమ కాదని ప్ర‌క‌టించిన‌ది.

ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఇకపై కాస్త ఎక్కువ ఖర్చు చేయక‌త‌ప్ప‌దు. ప్రైమ్ మెంబ‌ర్ షిఫ్ ధ‌ర‌ల‌ను ఏకంగా 50 శాతం వ‌ర‌కు పెంచిన‌ది. కొత్త ధ‌ర‌లు మాత్రం డిసెంబ‌ర్ 14వ తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి. డిసెంబ‌ర్ 14 నుండి సంవ‌త్స‌రం కాలం పాటు స‌బ్ స్క్రిప్ష‌న్‌కు రూ.1499, నెల ప్లాన్‌కు రూ.179, మూడు నెల‌ల కాలానికి రూ.459 చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను ఇక రూ.266 పెంచాయి ఆయిల్ కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇక‌ డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో  చూడాలి మ‌రీ.మరింత సమాచారం తెలుసుకోండి: