అఫ్ఘ‌నిస్థాన్ ప్ర‌జ‌లు తాలిబ‌న్ ల పాల‌న‌లో అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఫ్ఘ‌న్‌ను చ‌ర‌బ‌ట్టిన తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు అధికారం ఏర్పాటు చేసి మూడు నెల‌లు గ‌డుస్తున్నా.. అక్క‌డి ప్ర‌జ‌ల్లో వాళ్లంటే భ‌యం పోలేదు. శాంతిభ‌ద్ర‌త‌ల పేరిట అనేక నియ‌మ నిబంధ‌న‌లను అమ‌లు చేస్తున్నారు. ష‌రియా చ‌ట్టాల‌కు లోబ‌డి తాలిబ‌న్‌లు పాల‌న కొన‌సాగిస్తున్నారు. నియంతృత ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌లు హింస‌కు గుర‌వుతున్నార‌ని అంత‌ర్జాతీయ స‌మాజం మండిప‌డుతోంది. ఈ క్ర‌మంలో అఫ్ఘ‌నిస్తాన్ ఆర్థిక సంక్షోభంలోకి కుంగిపోతోంది. ఇన్ని జ‌రుగుతున్నా తాలిబ‌న్‌లు మాత్రం త‌మ ప‌ట్టు వీడ‌డం లేదు.. అఫ్ఘ‌న్‌లో త‌మ ప్ర‌త్యేక చ‌ట్టాలు అమ‌లు చేయాల‌ని తాప‌త్రయ ప‌డుతున్నారు.

 
 గ‌తంలో మ‌హిళ‌ల‌పై అనేక నియ‌మ‌, నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చారు.. త‌రువాత కూడా అనేక ఆదేశాలు జారీచేసిన తాలిబ‌న్‌లు.. ఇప్పుడు తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు.  అఫ్ఘ‌నిస్తాన్‌లోని జైళ్ల‌లో ఉన్న 210 మంది ఖైదీల‌ను తాలిబ‌న్ ప్ర‌భ‌త్వం విడుద‌ల చేసింది. ఈ నిర్ణ‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాంతి భ‌ద్ర‌త‌లు అంతంత మాత్రంగా ఉండ‌డంతో ప్ర‌జ‌లు దేశం విడిచి పారిపోయేందుకు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో తాలిబ‌న్‌లు అఫ్ఘ‌నిస్థాన్‌లో ఉన్న వివిధ జైళ్ల‌లో ఉన్న ఉగ్ర‌వాదుల‌ను విడుద‌ల చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.


  మిలిటెంట్ల విడుద‌ల‌తో దేశంలో మ‌రింత శాంతి, భ‌ద్ర‌త‌లు క్షీణించడంతో పాటు హింస చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. హెల్మాండ్‌, ఫ‌రా ప్రావిన్స్‌ల‌లోని  జైళ్లలో  ఉన్న 600 మందికి పైగా మిలిటెంట్ల‌ను ఈ సంవ‌త్స‌రం మొద‌ట్లో విడుద‌ల చేసిన‌ట్లు అఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌భుత్వ మీడియాను ఊటంకిస్తూ స్పుత్నిక్ వార్తా సంస్థ వెల్ల‌డించింది. ఇప్పుడు తాజాగా 210 మంది ఉగ్ర‌వాదుల‌ను విడుద‌ల చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో తాలిబ‌న్ ప్ర‌భుత్వం మున్ముందు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నే భ‌యంలో అఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇప్ప‌టికే తాలిబ‌న్‌ల‌కు ఐసీస్ -కె ల‌కు మ‌ధ్య పోరు సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: