మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైన సంకట స్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు తమ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఎంత కష్టపడుతున్నారో ?  చివరకు వారు ఎమ్మెల్యేలు గా గెలిచేందుకు కూడా అంతే కష్టపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీరిద్దరికీ కూడా చాలా సురక్షితమైన నియోజకవర్గం కావాల్సి ఉంది. చంద్రబాబు ఓటమి లేకుండా వరుసగా ఎనిమిది సార్లు గెలుస్తూ వస్తున్నా కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు టిడిపి పరిస్థితి రివ‌ర్స్ లో ఉంది.

గత ఎన్నికల్లోనే ఆయన మెజార్టీ అక్కడ దారుణంగా పడిపోయింది. చంద్ర‌బాబు కొన్ని రౌండ్ల‌లో వెన‌క ప‌డి చివ‌ర‌కు 30 వేల అత్తెస‌రు మెజార్టీ తో గెలిచారు. ఆ తర్వాత కుప్పం లో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవ‌లం ఆరు కౌన్సెల‌ర్ సీట్ల తో స‌రి పెట్టుకుంది. గత సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు.

కుప్పంలో బాబు కంచుకోట కదులుతోంది. ఇలాంటి టైం లో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు - లోకేష్ త‌మ పాత నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా ? లేదా అన్న‌దే ఆసక్తిగా మారింది. కుప్పం - మంగళగిరి తో పోలిస్తే బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త బాగుంది. అక్కడ బాలయ్య గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

లోకేష్ .. చంద్రబాబు కానీ నియోజకవర్గం మారాలి అనుకుంటే వారికి కచ్చితంగా హిందూపురం బెస్ట్ ఆప్ష‌న్‌ అవుతుంది. అప్పుడు బాలయ్య హిందూపురం నుంచి సైడ్ అవ్వాల్సిన‌ పరిస్థితి ఉంది. అదే జ‌రిగితే బాల‌య్య అప్పుడు మ‌రో చోట నుంచి పోటీ చేస్తారా ?  లేదా రాజ్య‌స‌భ‌కు వెళ్లి పోతారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: