జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెమ్మదిస్తుండటం మొదటి నుండి ఆ పార్టీలో లోటు కనిపిస్తూనే ఉంది. అది ఆయన అనాసక్తి కావచ్చు లేదా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం వలన కావచ్చు పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడో కానీ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఎవరైనా పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఇప్పటివరకు ఎవరికీ వచ్చినట్టే లేదు. తాజాగా ఆ దిశగా అడుగులు వేసిన అధ్యక్షుడు, నాదెండ్ల ను అందుకు ఎంచుకున్నట్టుగానే ఉంది. అందుకే ఆయన తాజాగా ఆయా పార్టీ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ, సేనకు మరోసారి ఆశలు కల్పిస్తున్నారు. ఒక్కగానొక్క ఎమ్మెల్యే గెలిచినా అతడు వేరే పార్టీ వైపు చూస్తుండటంతో, ఆ స్థానం నుండే పార్టీ బలోపేతం దిశగా జనసేన అడుగులు వేస్తుంది.

ప్రస్తుతం అక్కడ ప్రతి విషయంలోనూ జనసేన ముందు ఉంటూ వారి ఎమ్మెల్యే కి ధీటుగా పనిచేస్తూ, తరువాత ఎన్నికలలో జనసేన అభ్యర్థిని వేరే వారిని నిలిపి అతడిని గెలిపించుకునేందుకు కూడా జనసేన సిద్ధం అవుతుంది. ఆ దిశగా ఆయా ప్రాంతాలలో సేన సహా నాదెండ్ల పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి నుండి ఇంత చొరవ కనీసం నాదెండ్ల తీసుకుని ఉంటె పరిస్థితి మరోరకంగా ఉండేది. ఈ చొరవ తో సేనలో కొత్త ఉత్సాహం వచ్చేసింది. దీనితో వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇలా ప్రతి నియోజక వర్గంలో జనసేన ప్రాంతీయ ప్రజలతో మమేకమై పోతే ఫలితాలు కాస్త మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈసారికి టీడీపీ కి దూరంగా ఉండాలని పార్టీ భావిస్తున్నప్పటికీ, తెరచాటున మాత్రం ఏదో ఒక ఒప్పందం ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. టీడీపీ స్వయంగా ఆ తరహా మద్దతుకు జనసేనతో పలు చర్చలు జరుపుతుంది. వాటికి జనసేన పడిపోకుండా ఒంటరిగా బరిలోకి దిగితే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం నాదెండ్ల రాష్ట్రము మొత్తం ఒక్కసారైనా తూరుపరపడితే(పర్యటనలు చేస్తే), అలాగే అధ్యక్షుడు కూడా తనకు వీలున్నప్పుడు కనీసం రాష్ట్రంలో ప్రధాన నగరాలలో పర్యటనలు పెట్టుకుంటే ప్రజలలో జనసేన కాస్త మెరుగ్గా కనిపించే అవకాశాలు ఉండొచ్చు. దానికి ఇప్పటి నుండే ప్రణాళిక వేసుకుంటే, సేన ఇన్నేళ్ల కష్టానికి ఈసారైనా కాస్త చక్కటి ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: