చైనా అండ చూసుకొని రెచ్చిపోయిన దేశాలలో పాక్ సరసన టర్కీ కూడా చేరిన విషయం తెలిసిందే. అయితే పాక్ పరిస్థితి ఎలా ఉన్నదో చూస్తూనే ఉన్నాం. పాక్ చైనా తో కలవక ముందు కేవలం అక్కడ కొన్ని తీవ్రవాద సంస్థలకు స్థావరకు ఉండేవి. అవి కూడా పెద్దగా ప్రపంచానికి తెలియదు. కానీ ఒక్కసారి చైనాతో జతకట్టగానే పాక్ తీవ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రపంచానికి పరిచయం చేయబడింది. చైనా కుయుక్తులు అలా ఉంటాయి. దానితో పాక్ కు చైనా తప్ప దిక్కు లేకుండా పోయింది. అప్పటి నుండి పాక్ కు ఏది కావాలన్నా చైనా ను అడుక్కోవడం తప్ప దిక్కులేకుండాపోయింది. అయినా అది తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. అమెరికా ఆఫ్ఘన్ రావడంతో తాలిబన్ లకు తన దేశంలో స్థావరం ఇచ్చింది పాక్. అప్పటి నుండి కన్నేసిన తాలిబన్ లు నెమ్మదిగా దానిని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.

తాజాగా చైనా ను చూసుకొని రెచ్చిపోయిన టర్కీ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. ఇప్పటికే పాక్ మాదిరే టర్కీ ని కూడా తీవ్రవాద ప్రేరేపిత దేశంగా అంతర్జాతీయ సంస్థలు గుర్తించినట్టు ఇటీవలే స్పష్టం చేశాయి. దీనితో దానికి కూడా చైనా నే దిక్కు అయిపోయింది. ఇలా చైనా తనను నమ్ముకున్న ఒక్కోదేశాన్ని తన అవసరాలకు వాడుకొని, పాము తన పిల్లలను తానే మింగేస్తున్నట్టుగా, అవసరం తీరింది అనగానే మింగేయడం ప్రారంభిస్తుంది. దానిని మొదటి అడుగుగా అడగగానే లేదా అడగకుండానే అప్పులు ఇచ్చేస్తుంది. ఇచ్చిన దానికి వడ్డీ అంటుంది. ఒకస్థాయిలో ఆయా దేశాలు తీర్చలేనంత అప్పు పేరుకోగానే ఇక మింగటం మొదలు పెడుతుంది.

ప్రస్తుతం టర్కీ అదే స్థాయిలో ఉంది. అక్కడ కనీసం ఆహార లభ్యత లేని విధంగా సంక్షోభం తలెత్తింది. ప్రజలను గతంలో తక్కువ తినాలని కోరిన కిమ్ మాదిరి టర్కీ ప్రభుత్వం కూడా తమ ప్రజలకు తక్కువ నాన్ వెజ్ తినాలని సూచించాల్సిన స్థితికి దిగజారిపోయింది. ప్రపంచ దేశాలు కావచ్చు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కావచ్చు పైసా అప్పు ఇవ్వకపోవడంతో రూపాయి విలువ పడిపోయి, దిక్కుతోచని స్థితికి వచ్చేసింది. కరోనా ఒకపక్క, ఆర్థిక సంక్షోభం మరోపక్క, ప్రస్తుతం ఆహార సంక్షోభం కూడా వచ్చేసింది. ఇలా చైనాను నమ్ముకున్న ఒక్కోదేశం ఒక్కోరకంగా నష్టపోతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: