కరోనా వైరస్ ప్రపంచ దేశాలు ఎంత అల్లాడిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుల వ్యవదిలోనే ప్రపంచ దేశాలకు పాకి పోయింది ఈ మహమ్మారి వైరస్.. అన్ని దేశాలలో కూడా ఈ విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. కరోనా వైరస్ కారణంగా కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 2-దశల కరోనా వైరస్కు దాదాపుగా ప్రపంచ దేశాలు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ మూడవ దశ కూడా ముంచుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు అత్యవసర వినియోగంలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీస్  పెరగటంతో కరోనా వైరస్ తో పోరాటం చేసేందుకు సిద్ధం చేసుకున్నాయి. ఇక అగ్రరాజ్యాలు అయితే ఇప్పటి వరకు ఏకంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అని చెప్పాలి.  బూస్టర్ డోస్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ను ఓమిక్రాన్ మాత్రం ప్రపంచ దేశాలను భయపెడుతుంది. కొత్త లక్షణాలతో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్ కేసుల ఎక్కువ ఉండడంతో అటు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓమిక్రాన్ వైరస్ ఎంతో ప్రమాదకరమైనది అంటూ అంటూ ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూ ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.


 అయితే ఓమిక్రాన్ ఎంతో ప్రమాదకరమైనది అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ పై వ్యాక్సిన్ లు ప్రభావం చూపుతాయా లేదా అన్న అనుమానం కూడా మొదలైంది  ఈ క్రమంలోనే ఇటీవలే ప్రముఖ టీకా తయారీ సంస్థ కూడా మోడర్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది  ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు ఓమిక్రాన్ పై చాలా తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది   వ్యాధికారక స్పైక్ ప్రోటీన్ పై అధిక సంఖ్యలో మ్యుటేషన్లు ఉండడమే దీనికి కారణం తెలిపింది. దీంతో వైరస్ వ్యాక్సిన్ లొంగకుండా తయారైపోయింది మోడర్న  కంపెనీ సీఈవో స్టేఫిన్ బ్యాన్సెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చే ఏడాది నాటికి మ్యుటేషన్లు అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: