ప్రస్తుతం భారతదేశం వడివడిగా అడుగులు వేయాల్సిన సందర్భం వచ్చింది. కరోనా సమయంలో ప్రపంచం ఊహించని విధంగా దేశం బయటపడింది. అంతటితో సరిపెట్టుకోకుండా తన వంతు అయిన వరకు ప్రపంచానికి చేయాల్సింది చేసింది. దీనితో అంతర్జాతీయ సమాజంలో మంచి పేరు తెచ్చుకుంది భారత్. అది రాబోయే రోజులలో మంచి అవకాశాలను అందించే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. అయితే దీనికోసం కేవలం ప్రభుత్వం సిద్ధంగా ఉండగానే సరిపోదు, ఆయా వ్యవస్థలు, ముఖ్యంగా యువత, పౌరులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. కానీ చూడబోతే, వ్యవస్థలలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వానికి అన్నీ అడ్డంకులు తెచ్చిపెడుతున్నాయి తప్ప కలిసి నడిచే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో దేశంలో ఉన్న పరిస్థితులు మరియు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను యువత అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కేవలం యువత 52శాతం ఉన్న గొప్ప సందర్భంలో ఇలాంటిఅవకాశం రావడం చాలా అరుదు. మరి అలాంటి అవకాశాన్ని భారత యువత సద్వినియోగం చేసుకోవడంలో ముందుకు వస్తారా లేదా ఎప్పటి లాగానే అన్ని ప్రభుత్వానికి వదిలేసి, తాము మాత్రం ఉద్యోగాల వేటలో ఉండిపోతారా అనేది ప్రశ్న. యువత ప్రభుత్వానికి సహకరించడం అంటే ఏమిటి? అన్ని వదిలేసి ప్రభుత్వం వెనక తిరగాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ వనరులు మా ప్రాంతంలో ఉన్నాయి, దేశానికి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మేము ఇక్కడ వనరులతో ఏమి చేయగలము, ఏమేమి చేయడం ద్వారా మా ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది. ఇలాంటివి అన్నీ చర్చించాలి. ఈ చర్చలు ఎవరితో చేయాల్సి ఉంటుంది అనేది మరో ప్రశ్న. ఒకటి ప్రాంతీయ నేతలతో చేయాలి. అది కేంద్ర నేత నా లేక ప్రాంతీయ పార్టీ నేతనా అనేది బాగా ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. రెంటి మధ్య సమన్వయము ఉంటె సరి, లేదంటే కాస్త కష్టపడాల్సి వస్తుంది.

స్వయంగా యువత ఒక టీం లాగా ఏర్పడి దేశంలో వనరులు ఏమిటి, ఏవిధంగా వాటిని వాడుకోవడం ద్వారా తాజా అవకాశాలను అందిపుచ్చుకోగలం అనేవి ముందు యువత చర్చించుకోవచ్చు. దానిపై ఒక జాతీయ స్థాయిలో సవివరంగా ప్రాజెక్టులు తయారు చేసి, వాటిని నేరుగా ప్రధాని కి తీసుయేళ్లడానికి ప్రయత్నించండి. ఆయనతో చర్చించి, ఆయా ప్రాజెక్టుల గురించి వివరించండి. ఇవన్నీ అయ్యేవేనా అనే ప్రశ్న మొదటిలో రాకూడదు. ప్రయత్నమే ముఖ్యం. ఇలా మీరు ఒక అడుగు వేస్తె, అందరు కలిస్తే చాలు మార్గాలు అవే కనిపిస్తాయి. ఎవరో చెప్పినట్టుగా చేయాలిసిన పని కూడా ఉండకపోవచ్చు, వనరులను అందరికి అందించే ప్రక్రియలో అభివృద్ధి అదే కనిపిస్తుంటుంది. ఇదంతా ఒక్కరోజు ప్రక్రియ కాకపోవచ్చు. యువత ముందు కులం, మతం, ప్రాంతం, లింగభేదాలు వంటివి మరిచి అందరు కలిసి పని చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక్క దశాబ్దం ఆ బేధాలు అన్ని కేవలం అటకమీద పెట్టేయండి, కావాలంటే దశాబ్దం తరువాత వాటిని మళ్ళీ ముట్టుకోవాలని అనిపిస్తే తీసుకోండి. యువత ఉమ్మడిగా దేశం కోసం ఒక్కసారి కూడా ఏ ప్రయత్నించలేదు కదా, ఈ ఒక్కసారికి చేద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: