గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ చెరువులు, వాగులు కట్టలు  తెంచుకుంటున్నాయి. ఎన్నో ప్రాంతాలు జల మయం అయ్యాయి. జాతీయ రహదారులపై సైతం నీరు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో రాక పోకలు కష్టతరంగా మారాయి. ప్రధానంగా నెల్లూరు-చెన్నై మెయిన్ రహదారిపై ప్రయాణానికి నీటి ప్రవాహాలు తీవ్ర ఆటంకాలుగా మారాయి. దీంతో చేసేది లేక వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ రహదారిపై ప్రయాణికులకు చుక్కెదురైందనే చెప్పాలి.

లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలు సైతం ఈ నీట మునగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర నిమిత్తం వేరే రూట్ల నుండి నెల్లూరు, మరియు చెన్నైకి ప్రయాణాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్నా నది ఉప్పొంగి ఆ వరదతో నెల్లూరు 16 వ నెంబర్ జాతీయ రహదారికి పెద్ద గండి పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్ధేందుకు రిపేర్ చేసేందుకు 24 గంటల పట్టింది, దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా గత రెండు రోజులుగా కురిసిన పెను వర్షాల కారణంగా నెల్లూరు నుండి వెళ్ళే మార్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి.

పలు చోట్ల వరద నీటి కారణంగా అంతరాయాలు కలుగుతున్న నేపథ్యంలో వేరే రూట్లలో ప్రయాణాలను నిర్వహిస్తున్నారు. కానీ వీటి వలన సమయం చాలా వృదా అవుతోంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పడం లేదు. ముఖ్యంగా  గూడూరు వద్ద రోడ్డు వరద నీటితో మునిగిపోయింది. తాత్కాలికంగా బ్రిడ్జ్ పైనుంచి కొన్ని వాహనాలకు మాత్రమే  రాకపోకలు జరుపుతున్నారు. ఎక్కువ వాహనాలను వేరే మార్గాలలో రాపూరు, పొదలకూరు, వెంకటగిరి మీదుగా రాకపోకలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రయాణికులు నెల్లూరు వైపు వస్తుంటే కొంచెం అలోచించి రావాల్సిన అవసరం ఉంది. ఈ  వారంలో కూడా వర్షం పడే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: