జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత...ప్రజలని ఆకర్షించే నాయకుడు ఎవరు? అంటే అబ్బే ఎవరు లేరనే చెప్పొచ్చు. ఉండటానికి నాదెండ్ల మనోహర్ ఉన్నారు గానీ...ఆయనకు జనాలని ఆకర్షించే సత్తా లేదు. అందుకే ఏపీలో జనసేన ఇప్పటికీ పుంజుకోలేకపోతుంది. మామూలుగా టీడీపీ, వైసీపీల్లో గానీ ప్రజలని ఆకర్షించే నాయకులు చాలామంది ఉన్నారు. చంద్రబాబు, జగన్‌లు సైలెంట్‌గా ఉంటే...వారి బదులు జనంలో తిరిగే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. అలాగే వారి వారి కెపాసిటీలు బట్టి ప్రజలని ఆకర్షించే సత్తా ఉంటుంది.

అయినా సరే చంద్రబాబు, జగన్‌లు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు కాబట్టి మిగిలిన నాయకులు అవసరం అంత పడకపోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ పరిస్తితి అలా కాదు. ఆయన ఒక వైపు సినిమాలు కూడా చేయాలి. అలా సినిమాలు చేస్తూ..మరో వైపు అప్పుడప్పుడు రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగడం ఉండదు. అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కల్యాణ్ ఫుల్‌గా రాజకీయం మాత్రం ఎప్పుడు చేయలేదు. ఏదో అప్పుడప్పుడు రాష్ట్రానికి రావడం...కాస్త హడావిడి చేసి మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్లిపోవడం. ఎప్పుడు ఇదే వరుస.

ఇటీవల కూడా సినిమా టిక్కెట్లు, రోడ్లపై గుంతలు విషయంలో రెండు, మూడు రోజులు హడావిడి చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఇంకా అంతే మళ్ళీ ఆయన రాష్ట్రంలో కనబడలేదు. సరే సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉండొచ్చు. అది తప్పు కాదు. కానీ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా పవన్‌పై ఉంది. పవన్ తప్పితే పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా మరొక నాయకుడుకు లేదు.

నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులు పార్టీ కోసం తిరుగుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు గానీ, పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. ఆయన చేసే కార్యక్రమాలు హైలైట్ కావడం లేదు. అదే పవన్ ఒక ప్రజా సమస్యపై పోరాటం చేస్తే ఫుల్ హైలైట్ అవుతుంది. కాబట్టి జనసేనకు పవన్ కల్యాణ్ తర్వాత...జనాలని ఆకర్షించే నాయకుడు ఒకరు కావాలి. అలా కాకుండా ఎల్లకాలం ఇలాగే రాజకీయం చేస్తే జనసేన కొంచెం కూడా బలపడదు.  
    


మరింత సమాచారం తెలుసుకోండి: