విజయ్ మాల్యా...మాజీ రాజ్యసభ సభ్యుడు ..ఒకప్పుడు ఆశేష జనవాహినిని ఆకట్టుకున్న విమానయాన సంస్థ అధినేత. అంతేకాదు పేరుమోసినమధ్యం బ్రాండ్ల కంపెనీ యు.బి గ్రూపు హక్కుదారు. ... వీటన్నింటినీ మించిన ఆర్థిక నేరస్తుడు. భారత్ లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన భవితవ్యాన్ని సుప్రీం కోర్టు తేల్చనుంది.
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించే వరకు వేచి ఉండలేమని, అతనికి విధించే శిక్షను  ఎప్పుడు విధించాలనేది జనవరి 18న నిర్ణయిస్తామని, నాడు ఈ  కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది.
ఆయన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. న్యాయస్థానం అదేశాలకు విరుద్దంగా  ఆయన  తన పిల్లలకు నలభై మిలియన్ డాలర్లు బదిలీ చేసి  కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు అని కోర్టు పేర్కోంది.
యూకే నుంచి రతకవిజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే అంశం తుది అంకానికి చేరుకుందని కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే ఆదేశంలో కొన్ని "రహస్య చర్యలు" పెండింగ్‌లో ఉన్నాయి, వాటి వివరాలు తెలియవు అని కూడా కేంద్రం కోర్టుకు వివరించింది. అయితే న్యాయస్థానం ఈ కేసు విషయంలో చాలా స్పష్టమైన నిర్ణయం వెలువరించింది. విజయ్ మాల్యా హాజరయినా, కాకపోయినా కేసును  జనవరి 18న విచారణ చేస్తుందని తెలిపింది. జస్టిస్ లలిత్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ మేరకు  అదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా..."అతను ధిక్కారానికి పాల్పడినట్లు 2017 నుంచి వాయిదా పడుతున్నందున ఈ విషయం వెలుగులోకి రావాలి. గత నాలుగు సంవత్సరాలుగా శిక్ష మాత్రమే పెండింగ్‌లో ఉంది" అని కోర్టు పేర్కొంది.
 మాల్యాను భారత్ కు అప్పగించాలని యునైటెడ్ కింగ్‌డమ్ లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ అది అమలులోకి రాలేదు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ   ఆదేశ సుప్రీం కోర్టుకు తెలిపింది.
 భారత్ లోని కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు ధిక్కార నేరం కింద 2017 మేలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ మాల్యా చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది.
మాల్యా తన సొంత సంస్థలలో ఒకటైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణ ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లో  నివాసం ఉంటున్నారు.
---------


మరింత సమాచారం తెలుసుకోండి: