జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలోనే కాకుండా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో సైతం వినిపిస్తోంది. తాజాగా జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న పూర్తి చేసుకున్నారు. అయితే.. వాస్త‌వానికి ఈ రెండున్న‌రేళ్ల‌లోనూ ఏడాదిపాటు క‌రోనా కే స‌మ‌యం గ‌డిచిపోయింది. లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు.. వంటివాటితో ఏడాదిపాటు.. కాలం గిర్రున తిరిగిపోయింది దీంతో పాల‌న ముందుకు సాగ‌లేదు.దీంతో ఏటా నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సులు జ‌ర‌గ‌లేదు. అదేస‌మ‌యంలో అభివృద్ధి కూడా ముందుకు సాగ‌లేద‌నేది నిజం. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు జ‌గ‌న్ వెంటే నిల‌బ‌డ్డారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. కేవ‌లం ఆయ‌న దూర దృష్టితో ప‌నిచేయ‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని విష‌యాల‌ను ఆయ‌న ప‌ట్టించుకుంటున్నారు. పైగా.. సొంత సామాజిక‌వ ర్గాన్ని ప్రోత్స‌హించార‌న్న వాద‌న‌కు ఎక్క‌డా తావివ్వ‌కుండా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను తీసుకునే నిర్ణ‌యాల్లోకానీ.. త‌ను చేస్తున్న ప‌నుల్లోకానీ.. ఎక్క‌డా జ‌గ‌న్‌.. త‌న వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. కేవ‌లం రాష్ట్రంలోని అన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దృస్టిలో ఉంచుకునే అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు.

అదే స‌మ‌యంలో మైనారిటీ వ‌ర్గాల‌కు కూడా ఆయ‌న చేరువ‌య్యారు. అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చారు. అదేవిధంగా ప్ర‌తి ఒక్క‌రికీ.. అవ‌కాశం ఉన్నంత మేర‌కు ప‌ద‌వులు ఇస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థ‌ల్లో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాద‌నేది దేశం మొత్తంలోనూ చ‌ర్చ‌సాగింది.ఇది జ‌గ‌న్ పాల‌న‌కు మంచి మార్కులు వేయిస్తోంది.

అదేస‌మ‌యంలో ఆద‌ప‌లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డంలోనూ.. జ‌గ‌న్ ప్ర‌బుత్వం ముందుంది. ప్ర‌తి స‌మ‌స్య‌ను త‌నే స్వ‌యంగా ప‌రిష్క‌రించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎవ‌రినీ ఎక్క‌డా నొప్పించ‌కుండా.. ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి లేద‌నేది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. వాస్త‌వాల‌ను గ‌మ‌నిస్తే.. కేంద్రంలోనూ ఎక్క‌డా అభివృద్ధి లేదు. ఇక‌, అప్పులు చేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. దీనికి కూడా కీల‌క‌మైన స‌మాధానం ఉంది. ఏపీలో.. ప్ర‌జ‌ల‌కు అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో అప్పులు చేయాల్సి వ‌స్తోంది.

మ‌రి ఇత‌ర రాష్ట్రాల్లో అప్పులు చేస్తున్న‌వారి ప‌రిస్థితి ఏంటి? ఆ నిధులు ఎక్క‌డికి పోతున్నాయి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంటే.. ఏపీమాదిరిగా వారు సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నారా? అంటే లేదు. అయిన‌ప్ప‌టికీ.. యూపీ, తెలంగాణ‌,త‌మిళ‌నాడు.. వంటి రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి. కానీ.. ఏపీ మాత్రం అప్పులు చేసినా ప్ర‌తి పైసా కూడా వారికే ఖ‌ర్చు చేస్తోంది. అదేస‌మ‌యంలో ప్ర‌తి రూపాయికీ అకౌంట‌బిలిటీ ఉంది. ఎక్క‌డా రూపాయి కూడా అవినీతి లేకుండా ముందుకు సాగుతోంది.

పాల‌న విష‌యంలో జ‌గ‌న్‌కు అన్నీ తెలిసే చేస్తున్నారు త‌ప్ప‌.. గ‌తంలో పాల‌కులు ఏదైనా జ‌రిగిన‌ప్పుడు.. అయ్యో.. అలా జ‌రిగిందా?  నాకు తెలియ‌దే .. అనే మాట మాత్రం రావ‌డం లేదు. సో.. మొత్తానికి జ‌గ‌న్ వైఖ‌రిపై జ‌గ‌న్ సానుకూలంగానే ఉన్నార‌ని .. అంటున్నారు పరిశీల‌కులు. అయితే.. వ‌చ్చే రెండున్న‌రేళ్లు అభివృద్దిపై దృష్టి పెడితే.. మంచిద‌ని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: