మహిళలకు మానసిక వేధింపులు ప్రతి చోట ఎదురవుతున్నాయని మరోసారి రుజువైంది. సాధారణంగా మతపరంగా, జెండర్ పరంగా, సామజిక పరంగా అనేక వివక్షలు ఇప్పటికే ఎదుర్కొంటున్న మహిళలకు ఇవ్వని ఏవో కొన్ని చోట్ల మాత్రమే అని అనుకుంటే పొరపాటు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి చోటుచేసుకుంటునే ఉన్నాయని తాజా వార్త మరోసారి స్పష్టం చేసింది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ, మహిళలు తమ వంతు పాత్ర నిర్వర్తిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా బాహ్యప్రపంచంలోకి వస్తున్నారు. ఇతరులతో పోటీగా ప్రతి రంగంలో ముందుంటున్నారు. దాదాపుగా ప్రస్తుత సమాజంలో అందరికి సమాన హక్కులు అంటుండటమే కాదు చాలా చోట్ల దానికి తగిన విధంగా అడుగులు కూడా పడుతున్నాయి.

ఒకపక్క సాంకేతికత అంటూ వెర్రి పెరిగిపోతున్నట్టుగానే మరోపక్క పైశాచిక మనస్తత్వాలు కూడా పెరిగిపోతున్నాయి. దానితో రానురాను నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అందులో మహిళల పట్ల జరిగే నేరాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇవన్నీ తగ్గించాలని కొత్త చట్టాలు రూపొందిస్తున్నారు తప్ప అవేమి అనుకున్నంతగా నేరాలను ఆపలేకపోతున్నాయి. కారణం సమాజంలో విచ్చలవిడి తనం పెరిగిపోతుండటం. అందుకే నేరాలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. ఒక స్థాయి వరకు కొన్ని ఉండటం విజ్ఞానం అనుకోవచ్చు కానీ, శృతిమించిన తనం మనిషిని మృగాన్ని చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆ మృగాన్ని చట్టాలు చూపించి భయపెట్టడం కష్టం.

ఆరోగ్యమైన సమాజమే మనిషిని మనిషిగా జీవించడానికి అనుమతి ఇస్తుంది. సమాజం విషయం అయిపోతుంటే, మనిషి మృగం అవడం ఖాయం, అలాగే నేరాలు పెరిగిపోవడం కాయం, దీనికి సాంకేతికతను సంబంధం లేదు. ఎంత సాంకేతికత పెరిగినా, దానిలో లోపాలను అడ్డుపెట్టుకొని, చట్టాలలో లోపాలను అడ్డుపెట్టుకొని నేరస్తులు పుట్టుకొస్తుంటారు తప్ప ప్రయోజనం ఉండబోదు. ఇక ప్రస్తుత వార్తలోకి వెళితే, ఆస్ట్రేలియా ప్రభుత్వంలో ఉన్న మహిళలపై, ప్రార్థనా మందిరాలలో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని స్పష్టం అయిపోయింది. అంటే అక్కడ సామాన్యుల పరిస్థితి ఎలా ఉండనుండో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు అనుకుంటా. ఇది నవ సమాజం సృష్టిస్తున్న మృగాల పట్టిక.

మరింత సమాచారం తెలుసుకోండి: