ఒకనాడు ప్రపంచ ఆధిపత్యం చేసిన బ్రిటిష్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా విరాజిల్లింది. ఆయా దేశాలకు వ్యాపారం అంటూ జొరబడి, వాళ్ళ లోపాలను తెలుసుకొని, వాటినే బలంగా మార్చుకొని ఆయా దేశాలపై ఆధిపత్యం సాగిస్తూ వచ్చింది. భరించినన్నాళ్లు అంతా సహించరు, తరువాత తమ భూభాగంపై వేరే వాడి పెత్తనం ఏంటనే ఆలోచన రావడంతో విరుచుకుపడటం ఆరంభించారు. దానితో స్వాతంత్ర ఉద్యమం ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి ఒక్కో దేశం మళ్ళీ బ్రిటిష్ కబంద హస్తాల నుండి స్వాతంత్రం పొందగాయి. అలాంటి దేశంలో భారత్ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు శతాబ్దాల పాలన, 90 ఏళ్ళ స్వాతంత్ర ఉద్యమం మరువటం అంత సులభం కాదు.

అయితే ఇంకా కొన్ని దేశాలు అలాగే బ్రిటిష్ కబంద హస్తాలలో ఉన్నాయా అంటే ప్రస్తుత ఘటన అవుననే చెపుతుంది. తాజాగా బార్బడోస్ అనే దేశం బ్రిటన్ నుండి ఆధిపత్యం నుండి విముక్తి పొందింది. సుమారు నాలుగు శతాబ్దాల తరువాత కరేబియన్ దీవులలో ఒకటైన ఈ చిన్న దేశం ఇప్పటికి బ్రిటన్ రాణివారి గుప్తాధిపత్యం నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్ లో గత రాత్రి జరిగిన వేడుకలలో కొత్త అధినేతను కూడా ఎన్నుకున్నారు. ఈ వేడుకలలో డామ్ సాండ్రా మాసన్ బార్బడోస్ కు కొత్త అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమానికి ప్రిన్స్ అఫ్ వేల్స్, బార్బడియన్ గాయని రిహన్నా కూడా హాజరయ్యారు.

రాజధానిలో వందలాది పౌరుల మధ్య ఈ స్వాతంత్ర వేడుకలు జరిగాయి. ప్రజల కరతాళ ధ్వనుల మధ్య గణతంత్రాన్ని ప్రకటించారు. దేశీయ జండా రాజధానిలో స్వేచ్ఛగా ఎగురుతుండగా, అధికారిక సాంప్రదాయ పద్దతిలో తుపాకులు పేల్చి వందనం చేశారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షులు మాట్లాడుతూ, గణతంత్ర బార్బడోస్ ప్రజలుగా మనము మన దేశానికి గొప్ప స్ఫూర్తిని అందించాలి. తరువాత తరాలకు గొప్ప భవిష్యత్తును అందించాలి. మనమే ప్రస్తుతం దేశానికి వెన్నెముకలం, మనం బార్బడోస్ ప్రజలం అని అన్నారు. దేశానికి కొత్త శకం ఆరంభం అయ్యింది.  శతాబ్దాల బ్రిటన్ అధిపత్యానికి తెరపడింది. ప్రస్తుత పరిస్థితులను తట్టుకొని పౌరులను సురక్షితంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: