దేశరాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం ఏడాదిపాటు కొనసాగింది. అయితే అప్పుడప్పుడు జరిగిన కొన్ని ఆందోలన కార్యక్రమాలలో 750 మంది రైతులు చనిపోయినట్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న రైతు సంఘాలు అంటున్నాయి. కేవలం రైతు చట్టాలు రద్దు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే వీరందరి పరిస్థితి ఏమిటనేది వారి ప్రశ్న. అయితే ఏడాది పొడవునా జరిగిన ఉద్యమంలో ఎవరు చనిపోయినది సరైన నివేదికలు లేవని, అలా లేనివాటికి పరిహారాలు ఎలా ఇస్తారని కేంద్రం అడుగుతుంది. ఇలా రైతు చట్టాలు రద్దు చేసినప్పటికీ కొత్త సమస్యను సృష్టించి దానిని ఇంకా కొనసాగించేట్టుగా చేసి, తద్వారా రాజధానిలో సమస్యలు సృష్టించాలని కొందరు చూస్తున్నారు. నిజానికైతే రైతు చట్టాలు రద్దు చేయడం వాళ్ళ డిమాండ్ అది నెరవేరింది కాబట్టి వాళ్ళు ఉద్యమం ఆపేయవలసి ఉంది.

కానీ ఉద్యమం నడిపిస్తున్నదే ప్రభుత్వం పై మచ్చ తేవడానికి. తద్వారా తరువాత జరగబోయే ఎన్నికలలో కాస్త గ్రాఫ్ పడిపోతుంది, అది తమకు అనుకూలంగా ఉంటుంది అనేది విపక్షాల రాజకీయ కుట్ర. పరిస్థితి ఏమిటి వాళ్ళు ఆలోచిస్తున్న తీరు ఏమిటి అనేది చుస్తే చాలు వాళ్ళ మనస్తత్వాలు ఏమిటో చెప్పడానికి. ఒక్కసారి పార్లమెంట్ సరిగ్గా జరగనిస్తే, రైతు చట్టాలు మొదటి రోజే సభలో ప్రవేశపెట్టి రద్దు చేసేయాలని కేంద్రం యోచించింది. అలా జరిగిపోతే రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని, రైతు సంఘాలను రెచ్చగొట్టి పరిహారాలని కొత్త నాటకం తెరపైకి తెస్తున్నాయి విపక్షాలు.

అసలు అంతమంది రైతులు చనిపోయారో లేదో తెలియదు, అంతమంది నిజంగా చనిపోతే రైతులు ఇంత శాంతియుతంగా ఉద్యమం చేస్తారా అనేది అప్పటికి రావాల్సిన ప్రశ్న. అయినా ఉద్యమం లో అప్పుడప్పుడు అల్లర్లు జరిగినప్పటికీ ఇంత భారీగా రైతులు మరణించి ఉంటె దానికి తగిన నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. కనీసం ఆయా మృతదేహాలకు జరిగిన శవపరీక్ష లాంటివి అయినా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అవన్నీ ఉన్నది లేనిది కూడా గ్రహించకుండా ఏదోఒక లెక్క చూపించి కొత్త రగడ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించాలని చూస్తే, దానిని ప్రభుత్వం సహకరించకుండా తగిన జవాబు చెప్పేసింది. అయితే ఇప్పటికి రైతు సంఘాల నుండి ఉన్న డిమాండ్స్.. తమ మీద ఉన్న కేసులు కొట్టేయాలి, మద్దతు ధర, విద్యుత్ చట్టంపై పునరాలోచన, మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: