ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది అన్నారు, సంబరాలు చేసుకున్నారు. ఆ హోరు అలా ఉండగానే కాలం ఇట్టే గడచిపోయింది. ఇపుడు వైసీపీ సర్కార్ సగం పాలన పూర్తి చేసుకుని పాతబడిపోయింది.

మరి సగం పాలన అంటే చిన్న విషయం కాదు, ఒక విధంగా జనాలకు ప్రభుత్వం మీద అవగాహన రావడానికి సరిపోయే సమయమే. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు. ఏపీలో జగన్ పాలన బాగా సాగుతోందా. విశ్లేషకులు, మేధావి వర్గం ఎలా రియాక్ట్ అవుతోంది ఇవన్నీ ప్రశ్నలే.

దానికి సమాధానాలు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలనే తీసుకుంటే మాది మంచి పాలన అని చెబుతారు. మేము అన్ని హామీలను పూర్తి చేశామని చెబుతారు. విపక్షాన్ని అడిగితే ఇది ఏ మాత్రం జనామోదం లేని పాలన అనేస్తారు. అన్ని విధాలుగా వ్యతిరేక‌త ఉన్న పాలన అని కూడా తూర్పారా పడతారు. అంటే ఈ రెండు అభిప్రాయాలను పక్కన పెట్టి చూడాలి.

నిజంగా జగన్ పాలన బాగుందా. అంటే బాగానే ఉంది. బాగులేదా అంటే కొన్ని విషయాల్లో అని చెప్పాలి. అవును జగన్ పాలనలో హామీలు చాలా వాటిని నిలబెట్టుకుంటున్నారు. అప్పులు చేసైనా చెప్పిన మాటను నెరవేరుస్తున్నారు. నవరత్నాల విషయంలో చిత్తశుద్ధి కనబరుస్తున్నారు. అదే టైంలో అభివృద్ధి లేదు అన్న వారికి జవాబు మాత్రం లేదు.

సంక్షేమం మాటున అప్పులు పెరిగి రాష్ట్రం చితికిపోతోంది అన్నది మేధావి వర్గాల మాట. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, అలాగే రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తారు అనుకుంటే మూడు రాజధానులతో కధ అడ్డం తిప్పారు. ఇక విభజన హామీల కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తారు అనుకుంటే అది జరగలేదు. మొత్తం మీద చూస్తే వైసీపీ నేతలు చెప్పినట్లుగా నూరు మార్కులు అయితే వేయరు. అలగని ఫెయిల్ కూడా చేసేది లేదు. ఎందుకంటే కరోనా రెండు దశలు ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కాబట్టి ఆ విచక్షణతో ఆలోచించి చూస్తే పాలన ఫరవాలేదు, అయితే మిగిలిన కాలంలో అభివృద్ధి ఇతరాత్ర కార్యక్రమాలు చేపట్టకపోతే మాత్రం 2024 ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు మరి.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

ap