ఇటీవల రాజకీయ ప్రసంగాలు శృతి మించిపోతున్నాయి. కేవలం హెచ్చరికలు చేసుకోవడానికే పనికివస్తున్నాయి. ఇదంతా ప్రజలు చూస్తున్నారు, వాళ్లకు తెలిస్తే పరిస్థితి ఏమిటి అనేవి కూడా పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒకదానిపై విమర్శలు చేస్తుండటం, దానికి ప్రతి విమర్శగా హెచ్చరికలు చేయడం ఈ మధ్య బాగా ఎక్కువగా అయిపోయింది. గతంలో వీళ్లంతా రౌడిలేమో అని అనిపించక మానదు. అప్పటి ప్రవర్తన ఇంకా వారిలో ఉందనేది చూపిస్తుంది, మరి గతంలో వీళ్లంతా రౌడీలో కాదో మరి. ప్రస్తుత ప్రవర్తన చూస్తుంటే మాత్రం అంతకంటే గొప్పగా ఏమి అనిపించడం లేదు. ఒక గౌరవమైన పదవిలో ఉంది లేదా ఆయా పదవులు అనుభవించి కూడా ఆ స్థాయిలో కాకుండా పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు.

ఒకనాడు ఈ విమర్శలు అన్ని ఆయా ప్రభుత్వాలు చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపినట్టుగా ఉండేవి. అది రాజకీయాలలో గౌరవనీయమైన విమర్శలు, అవి ప్రతిపక్షాలు చేయడం సహజం. అది నిజమేనేమో పరీక్షించుకోవడం ప్రభుత్వం విధి కూడా. కానీ ఇటీవల రాజకీయ నేతలు స్టేజి ఎక్కితే సవాళ్లు, హెచ్చరికలు తప్ప మరొకటి ఉండటం లేదు. అసలు సాంప్రదాయ లేదా పనికి వచ్చే విమర్శ అసలు ఒక్కటి కూడా ఉండటం లేదు. ఎప్పుడు చూడు ఎక్కువ మాట్లాడితే వేసేస్తాం అని అనుకోవడం కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసిన లేదా చేస్తున్న వారు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది వారివారి విజ్ఞతకే వదిలేయాల్సిందే.

గతంలో మధిర కౌన్సిలర్ మల్లాది వాసు వైసీపీ వైపు చూస్తున్న ఎమ్మెల్యే వంశీ ని ఎవరైనా చంపితే 50 లక్షలు ఇస్తానని ప్రత్యక్షంగానే చెప్పారు. దానికి తాజాగా వంశీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్లాది లాంటి వారిని ఆయా పార్టీలలో పెట్టి పోషిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబు అని, ఆయన ఉనికి కాపాడుకోవడానికి ఎన్ని రాజకీయాలైన చేస్తారని అన్నారు. వైసీపీ చేసేది ఓర్వలేక మొన్నటివరకు గుళ్లపై దాడులు చేయించారు, తాజాగా వన భోజనాల పేరుతో కులాల వారీగా గొడవలు పెట్టడానికి పూనుకుంటున్నారు. కమ్మ కులం అంటే ఒకనాడు ధార్మిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించేవారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చంద్రబాబు వద్దకు వెళ్లారో అప్పటి నుండి వాళ్ళు పనికిమాలిన ఖర్చులకు తప్ప మరోదానివైపు చూడటం లేదు. తమ పార్టీలో ఉన్నంతవరకు అందరు మంచివాళ్ళు, బయటకు వెళ్తే తప్పుదోళ్లు అనేది నిజం అయితే అందులో ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడి పార్టీల నుండి వచ్చినవారే అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక చావు వరకు రావాలంటే, డబ్బు ఉంటె సరిపోదు, గుండెల్లో దమ్ము ఉండాలి. అది ఎవరికి ఎంత ఉంది అనేది తేల్చుకుందాం, దానికేముంది. ఊరికే సామజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేసుకోవోడం కాదు చంపటం, చావడం అంటే. దొంగ నాటకాలు ఆపి, పని చూసుకుంటే మంచిది అన్న చందాన వంశీ స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: