ఇప్పుడు ప్రపంచమంతా ఒమిక్రాన్ అన్న పదం వింటే వణికిపోతోంది. కరోనాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ మహా డేంజర్‌ అని ఇది ప్రబలిందంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా వంటి దేశాలలో బాగా వెలుగు చూసిన ఈ ఒమిక్రాన్ వేరియంట్.. రోగులపై తీవ్ర ప్రభావం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు కూడా. అందుకే అనేక దేశాలు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంత సులభంగా తమ దేశాల్లోకి అనుమతించడం లేదు. కొన్ని దేశాలు ఏకంగా ఆఫ్రికా దేశాల నుంచి విమానాలను మూసేశాయి కూడా.


అయితే.. ఇప్పుడు ఇండియాలోనూ ఈ ఒమిక్రాన్ టెన్షన్ తీవ్రంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ముంబయిలో ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చినవారిలో చాలామంది ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఆఫ్రికా దేశాల నుంచి ఇండియా వచ్చిన వారు తమ పాస్‌పోర్టుల్లో  పేర్కొన్న చిరునామాల్లో ఉండటం లేదట. ఇలాంటి వారి వల్ల ఒమిక్రాన్ పొరపాటున ఇండియాకు వచ్చి ఉంటే.. దాని పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.


ఇక అధికారుల లెక్కల ప్రకారం ఆఫ్రికా దేశాల నుంచి  15 రోజుల్లో సుమారు వెయ్యిమంది వరకు ముంబయి వచ్చారట. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ భయంతో వారి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకూ వారిలో 466మందిని మాత్రమే గుర్తించారట. అంతే కాదు.. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల బిహార్‌కు దాదాపు 300 మంది వరకూ వెళ్లారట. ఇప్పుడు వీరిలో ఓ వంద మంది వరకూ కనిపించడం లేదట. ఇలా ఆఫ్రికా దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారిలో పొరపాటున ఎవరికైనా ఒమిక్రాన్ ఉన్నట్టు తేలిదంటే.. ఈ కేసుల సంఖ్య కూడా వేగంగా పెరిగే అవకాశం లేకపోలేదు. అలా ఒకవేళ ఇండియాకు ఒమిక్రాన్ వచ్చిందంటే.. దాని వ్యాప్తిని ఆపడం ఎవరి వల్లా కాదని.. మూడోవేవ్ తప్పదని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: