నొప్పిలేని నిమిష‌మేది జ‌న‌న‌మైన
మ‌ర‌ణ‌మైన జీవితాన అడుగు అడుగున‌

ఉద్వేగ భ‌రిత పాట‌కు, చైత‌న్యం తోడు ఇచ్చి న‌డిపించిన ఒరవ‌డికి తానే చిరునామా. తాత్విక భూమిక ఉండే పాట‌లు రాసిన సిరివెన్నెల ఎంద‌రినో ప్ర‌భావితం చేశారు. కొత్త త‌రంను త‌న‌వైపు మ‌ర‌ల్చుకున్నారు. ఉత్త‌మ సాధ‌కుడి ల‌క్ష‌ణాన్ని వివ‌రించి ప్రయాణించారు. ఆ  మ‌హ‌నీయుని స్మృతిలో... ఇంకొన్ని వివ‌రాలు...

తెలుగు సినిమా పాట సాహిత్యంలో ఆఖరి నిబద్ధాక్షరి, వికాస తరంగం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పలువురు వక్తలు నివాళులి చ్చారు. స్థానిక సన్ డిగ్రీ కళాశాలలో సిరివెన్నెల స్మృతిలో పేరిట సాహిత్య సభను నిర్వహించి, ఆయన పాటలను, వాటి ఔన్నత్యా న్ని స్మరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కామేశ్  మాట్లాడుతూ..మన ప్రాంతం నుంచి ఎదిగివచ్చి, గొప్ప పాటకు ప్రతినిధి గా నిలిచి, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆయన తెలుగు వారి ఇంటి గౌరవం అని అన్నారు. పాటతో తాత్వికత, ఆధ్యాత్మిక అన్న లక్షణాలు ఏక కాలంలో సాధించి భారతీయతను సమున్నత రీతిలో చాటిన కవి సిరివెన్నెల అని, సినీ మాధ్యమంలో ఇటు వంటి గేయ కవులు అరుదు అని జువాలజీ లెక్చరర్  గణేశ్ కీర్తించారు. పాట రాశాక అందులో అర్థ పరమార్థాలను వివరించి విశ్లేషిం చే కవులలో అభ్యుదయ వాదం సమున్నత రీతిలో వినిపించే కవులలో ఆయన అగ్ర గణ్యులు అని అన్నారు తెలుగు మాస్టారు భ వానీ ప్రసాద్. అనంతరం విద్యార్థుల కొందరు తమ భావాలను పంచుకున్నారు.  సిరివెన్నెల సాహిత్యాన్ని విశ్లేషించి  తమకు గొప్ప పాట, గొప్ప మాట ఈ తరానికి సైతం అందించిన ఘనత ఆయనదే అని కీర్తించారు. విద్యార్థులకు సిరివెన్నెల ఎంతో ప్రేమించిన ఆధు నిక వచన కవితా సంపుటి అమృతం కురిసి న రాత్రి ని కళాశాల డైరెక్టర్ అందించి, అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మురళీ కృష్ణ, మ్యాథ్స్ లెక్చరర్ రమేశ్, పాత్రికేయుడు రత్నకిశోర్ శంభుమహంతి, బోధనా,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. తొలు త సిరివెన్నెల కు నివాళి అర్పిస్తూ వారి సంస్మరణార్థం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: