విదేశాలలో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూడాలనుకునే వారికి ఇది ఖచ్చింగా ఇబ్బంది కలిగించే వార్త. కోవిడ్-19లోని తాజా వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యం పలు దేశాలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. ఈ కోవలో ఆసియా లోని మరో పెద్ద దేశం చేరింది.ఈ కోవలోనే మరికొన్ని దేశాలు చేరనున్నాయా ?
అంతర్జాతీయంగా ఓమిక్రాన్  కేసులు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం  అంతర్జాతీయ  విమాన సర్వీసులను  పునరుద్ధరణను నిలిపి వేసింది. వాస్తవానికి ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాల్సి ఉంది. శరవేగంగా కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ విస్తరించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏమియేషన్  ఈ విషయాన్ని వెల్లడించారు.  తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయం తరువాత ప్రకటిస్తామని  తెలిపారు. దాదాపు రెండేళ్లక్రితం అంటే 2020  మార్చి నెలాఖరు నుంచి భారత్ అంతర్జాతీయ విమానాలను నడపడం లేదు. . అయితే గత నెలాఖరులో సమావేశమైన  విమానయాన సంస్థ అధికారులు డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కానీ తాజాగా ఈ నిర్మయాన్ని వెనక్కితీసుకున్నారు. అంతర్జాతీయ సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా భారత్ చర్యలపై డబ్ల్యూ. హెచ్ ఓ అసంతృప్తి  వ్యక్తం చేసింది. ఆప్రికా దేశాలను టార్గెట్ చేస్తూ ఓమిక్రాన్ పై  భయాందోళనలు పెంచడం సరికాదని పేర్కోంది. విమాన సర్వీసులను రద్దు చేయడం ద్వారా ఓమిక్రాన్ ను అరికట్ట లేమని స్పష్టం చేసింది. కోవిడ్-19 టీకా వేసుకోని వాళ్లను, వయసు పై బడిన వాళ్లను మాత్రం  అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా నివారిస్తే సరిపోతుందని పేర్కోంది.
భారత ప్రభుత్వం తాజా నిర్ణయంతో  విదేశాలకు వెళ్లాలనకున్న చాలా మంది  నిరాశకు గురయ్యారు.  గత రెండు సంవత్సరాలుగు తన కుటుంబ సభ్యులతో వాట్సప్ ద్వారా నే మాట్లాడుకుంటున్నామని, నేరుగు కలుసుకోవచ్చన్న తమ ఆంకాక్షలను ఈ మాయదారి కోవిడ్  మంటగలిపిందని వారు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: