ఇప్పుడు ప్రపంచం అంతా కరోనాలోని ఒమిక్రాన్ వేరియంట్‌ అంటే భయపడిపోతోంది. చాలా వేగంగా వ్యాపిస్తుందని పేరున్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 20కి పైగా దేశాల్లో వ్యాపించేసిందట. అందుకే అనేక దేశాలు ఆఫ్రికా దేశాల నుంచి విమానాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఏకంగా అన్ని దేశాలతో తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నాయి. అయితే.. ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అంటున్నారు. ఈ మేరకు ప్రపంచ దేశాలకు ఆయన సూచనలు ఇచ్చారు. ఒమిక్రాన్ పై మరీ ఎక్కువ కఠిన ఆంక్షలు అవసరం లేదని ఆయన చెబుతున్నారు.


అసలు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తమకే ఇంకా క్లారిటీ రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్పష్టంగా చెబుతున్నారు. తమకే పూర్తి అవగాహన రాలేదన్నారు. అసలు ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ తీవ్రత ఎంత? ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కుంటాయా లేదా.. అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం తమకు దొరకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ చెబుతున్నారు. వీటికి సమాధానాలు అన్వేషించాల్సి ఉందని తెలిపారు.


అయితే.. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉన్నా ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదన్న సంగతి కూడా గుర్తించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గుర్తు చేస్తున్నారు. అందుకే.. దీనిపై కఠిన చర్యలు వద్దని ఆయన సూచిస్తున్నారు. అయితే.. అప్పుడే కొన్ని దేశాలు మాత్రం  వైరస్‌ కట్టడి పేరుతో అనవసరంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అభిప్రాయపడ్డారు.


కేవలం ఇలాంటి కఠిన ఆంక్షలతోనే ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌ను నియంత్రించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ చెబుతున్నారు. ఇలాంటి ఆంక్షలతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని చెబుతున్నారు. దీనివల్ల కరోనా కట్టడి సంగతి ఎలా ఉన్నా..  పరిస్థితులు మరింత దిగజారుతాయని అని టెడ్రోస్‌ అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: