బోయపాటి శ్రీనివాస్... ఈ పేరు చెబితే చాలు.... నందమూరి బాలకృష్ణ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంకా చెప్పాలంటే... బాలయ్య ఫ్యాన్స్‌కు ఇప్పుడు బోయపాటి దేవుడులా కనిపిస్తున్నాడు. ఐ సినిమాలో హీరో అన్నట్లుగా... అంతకు మించి అనే స్థాయిలో బోయపాటిని కోలిచేస్తున్నారు బాలయ్య అభిమానులు. బీబీ - 3 అంటూ బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వచ్చిన ఈ సినిమా తొలి నుంచి అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. గతంలో బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజండ్ సినిమాలు ఒక రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే బాలయ్య కెరీర్‌ను ఒక రేంజ్‌కు కూడా తీసుకెళ్లాయి. లెజండ్ సినిమాలో బాలయ్య డబుల్ రోల్‌లో కనిపించడంతో... నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు కూడా. బాలయ్య డైలాగ్‌లకు ఫిదా అయ్యారు కూడా.

ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అఖండ కూడా ప్రస్తుతం హ్యాట్రిక్ విక్టరీ కొట్టేసింది. ప్రస్తుతం తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్‌లో ఓ రికార్డు రేపుతోందని ఇప్పటికే బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది అఖండ. గతంలో టీజర్ రిలీజ్ చేసిన సమయంలోనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో బోయపాటి చెప్పాశారు. దీంతో ఎప్పుడెప్పుడా అని బాలయ్య అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. టీజర్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్... అప్పటి రాజకీయాలపై ఓ సెటైర్‌గా భావించారు. శీను గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అని అడిగేందుకు చాలా తేడా ఉంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా. అసలు బాలయ్య అభిమానులకు ఏం కావాలో బోయపాటికి బాగా తెలుసని కూడా ఇండస్ట్రీలో టాక్. దీంతో ఇప్పుడు బాలయ్య అభిమానులకు దేవుడయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: