ఉత్తరాంధ్రకు `జావిద్‌` తుఫాన్ గండం పొంచి ఉన్న నేప‌థ్యంలో జిల్లాల పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో గురువారం ఏర్పాటు చేసిన స‌మీక్ష‌లో సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు.

 

   లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది క‌ల‌గ‌కుండా  చూడాలని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు అదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం జ‌గ‌న్‌. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌. అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును బాధ్య‌త‌లు ఇస్తూ నియమించారు. ఆ అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుఫాన్‌ సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అ

 

     ద‌క్షిణ థాయ్‌లాండ్ ప‌రిస‌రాల్లో ఏర్ప‌డిన అప్ప‌పీడనం.. అండ‌మాన్ స‌ముద్ర ప‌రిస‌రాల్లోకి ప్ర‌వేశించి, ఆ త‌రువాత ప‌శ్చిమ వాయువ్యంగా ప‌య‌నించి గురువారానికి వాయుగుండంగా మారుతుంద‌ని తెలుస్తోంది. ఆగ్నేయ‌-తూర్పు మ‌ధ్య బంగాళ‌ఖాతంలోకి ప్ర‌వేశించి 24 గంట‌ల్లో తుఫాన్‌గా మార‌నుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. జావిద్ తుఫాన్ శ‌నివారం ఉద‌యం నాటికి ఉత్త‌రాంధ్ర తీరం దిశ‌గా ప‌య‌నించ‌నుంది. దీని ద్వారా రేప‌టి నుంచి విజ‌య‌న‌గరం, శ్రీ‌కాకులం, విశాఖ‌ప‌ట్నం, ద‌క్షిణ ఓడిషాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: