ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నాటి నుంచి వినూత్న నిర్ణయాలతో ప్రజాభిమానం చురగొన్నారు. పరిపాలన వ్యవస్థలో సంచలన నిర్ణయాలతో మార్పులు తీసుకువచ్చారు వైఎస్ జగన్. అందుకనే తమకు ప్రజలు అన్ని ఎన్నికల్లో సూపర్ విక్టరీ అందించారని కూడా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. పంచాయతీ, మునిసిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించింది అందుకే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసమే ప్రజలకు మరింత మేలు చేసేందుకు జగన్ సర్కార్ పని చేస్తుందని కూడా అంటున్నారు. ఇప్పుడు తాజాగా సినిమాటోగ్రఫీ చట్టంలో కీలక మార్పులు చేసింది జగన్ సర్కార్. ఇందుకు సంబంధించిన బిల్లును తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు కూడా.

తాజాగా సినిమా టికెట్ల కొత్త ధరలను జగన్ సర్కార్ ప్రకటించింది. కొత్త రేట్ల ప్రకారం అత్యంత కనిష్ఠ ధర 5 రూపాయలు కాగా, అత్యంత గరిష్ఠ ధర 250 రూపాయలుగా ప్రకటించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ధరను నిర్ణయించింది వైసీపీ సర్కార్. మునిసిపల్ కార్పోరేషన్ ప్రాంతాల్లోని మల్టీపెక్సుల్లో ప్రీమియం ధరను 250 రూపాయలుగా, డీలక్స్ 150 రూపాయలు, ఎకానమీ 75 రూపాయలుగా ప్రకటించారు. ఇక ఏసీ, ఎయిర్ కూల్ ధియేటర్లలో ప్రీమియం డీలక్స్ రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40గా ఫిక్స్ చేశారు. ఇక నాన్ ఏసీ లో 60, 40, 20 రూపాయలుగా డిసైడ్ చేసింది ప్రభుత్వం. మునిసిపాలిటీ ప్రాంతాల్లో మల్టీపెక్స్‌ల్లో అయితే 150, 100, 60 రూపాయలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇకే ఏసీ, ఎయిర్ కూల్ థియేటర్లలో 70, 50, 30 రూపాయలుగా ప్రకటించింది. ఇక నాన్ ఏసీ థియేటర్ల కోసం 50, 30, 15 రూపాయలుగా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇకన నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల కోసం కూడా ప్రత్యేక ధరలు ప్రకటించారు నగర పంచాయతీల్లోని మల్టీప్లెక్స్ ప్రీమియం ధర 120 కాగా... గ్రామ పంచాయతీల్లోని నాన్ ఏసీ ఎకానమీ టికెట్ ధరను 5 రూపాయలుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ధరలతో సినిమా థియేటర్ల నిర్వహణ అత్యంత కష్టమంటున్నాయి యాజమాన్యాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: