తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీలు... మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్త అడుగులు వేస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో కేసీఆర్ రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ అన్నట్లుగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు కూడా. తమ విజయం కోసం ఇప్పుడు ట్రెండింగ్ ఫార్ములాను వీళ్లు కూడా అనుసరిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంది. పీకే టీమ్ సాయంతో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ సీట్లను కూడా గెలుచుకుంది వైసీపీ. దీంతో మరోసారి కూడా పీకే టీమ్ హెల్ప్ తీసుకోవాలని జగన్ పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా జగన్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఐ ప్యాక్ టీమ్ వైసీపీ కోసం రాష్ట్రంలో పని చేస్తుందని మంత్రివర్గ సహచరులతో జగన్ చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారిన ప్రశాంత్ కిషోర్... ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అదే సమయంలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలను ఓడించే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యత కూడా పీకే చేపట్టారు. ఇప్పటికే నితిష్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్ మోహన్ రెడ్డిలతో సమావేశమైన పీకే.. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలపైనే పీకే ప్రధానంగా దృష్టి సారించారు. ఐ ప్యాక్ చెందిన ఓ టీమ్ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు వస్తున్నాయి. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాన్ని పీకే టీమ్ సేకరిస్తోంది. చివరికి తమ వివరాలను పార్టీ నేతలకు తెలియకుండా ఐ ప్యాక్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన, ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వే ద్వారా సేకరిస్తోంది పీకే టీమ్.


మరింత సమాచారం తెలుసుకోండి: