వరుస భారీ బ‌డ్జెట్ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఎన్న‌డూ లేని విధంగా టికెట్ రేట్లు కుదించి సినిమా చూపిస్తున్నారు సీఎం జ‌గ‌న్. ఈ ప‌రిణామాల్లో ఎవ‌రు గెలిచినా ఎవ‌రు ఓడినా అంతిమంగా మార్కెట్లో సినిమా నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టం. అందుకే ఇండ‌స్ట్రీని కాపాడ‌మ‌ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కూడా నిన్న‌టి వేళ వేడుకున్నారు. గ‌తంలో మాదిరిగా వినోద‌పు ప‌న్ను ఎగ్గొట్ట‌డానికి వీల్లేద‌ని, అందుకే తాము ఆన్లైన్ టికెటింగ్ విధానం తీసుకువ‌చ్చామ‌ని అంటున్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న ప‌ద్ధతుల్లో సినిమా రూపొందించి న‌ష్ట‌పోయే క‌న్నా ఊరుకోవ‌డం బెట‌ర్ అని ప‌లువురు చిత్ర నిర్మాత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు మాత్రం టికెట్ ధ‌ర పెంచి ఆన్లైన్ చేయ‌మ‌ని అడుగుతున్నారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఆదాయం అధికంగా వ‌స్తుంద‌ని కూడా చెబుతున్నారు. ఇవేవీ ఎలా ఉన్నా జ‌గ‌న్ అనుకున్న విధంగా లేదా కోర్టు మొట్టికాయ‌లు వేసిన విధంగా రానున్న ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక.

సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ ఏపీ సీఎం జ‌గన్ చేసిన ప్ర‌తిపాద‌నలు ఏవీ అంగీకారంలో లేవ‌ని చాలా మంది సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఐదు రూపాయ‌ల‌కే సినిమా చూపించ‌మ‌ని చెప్ప‌డం ఎంత వ‌ర‌కూ భావ్య‌మో చెప్పాల‌ని వాళ్లంతా  నిల‌దీస్తున్నారు. ఈ క్ర‌మంలో చాలా చోట్ల జ‌గ‌న్ నిర్ణ‌యంపై నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా జ‌గ‌న్ తాను అనుకున్న‌దే చేసేశారు. ఇప్పుడిక సినిమా భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోంది? ఆయ‌న చెప్పిన విధంగా చౌక ధ‌ర‌ల‌కే వినోదం అందించే సీన్ సినిమాకు ఉందా లేదా? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే! ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో టికెట్ రేటు పెంచుకునే అవ‌కాశం ఉంది కానీ ఆంధ్రాలో ఇంకా ఆ వెసులు బాటు లేదు. సినీ నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నా జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp