గూడూరు సమీపంలో నదుల వరద తాకిడికి గురైన ప్రాంతాలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా టిడిపి నేతలు, కొన్నిపత్రికలపై మంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 2018 లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామన్న దేవినేని ఉమా ని ఎందుకు ట్రోల్ చెయ్యరు అని అడిగారు. పోలవరం ఎందుకు అలస్యమైందో మీకు తెలియదా అంటూ ప్ర‌శ్నించారు. డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని గుర్తు చేశారు. నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయ‌డం లేద‌ని .. చేస్తున్నందంతా టిడిపి నేతలే అని ఆరోపించారు.


నిజాలు చెప్పే దమ్ము మీకు లేదని తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏదైనా ఉంటే వాస్తవాలు ట్రోల్ చేయండి అంటూ పత్రికలకు, మీడియా ఛానల్స్ కు మంత్రి అనికుమార్ యాద‌వ్‌ హితవు ప‌లికారు. అయితే, పొల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు గతంలో ప్రభుత్వం పెట్టిన డెడ్‌లైన్‌లపై సామాజిక మాధ్య‌మాల్లో ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ గతంలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు సోష‌ల్ మీడాయాలో ట్రోల్ అవుతున్నాయి. 2021 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ స‌వాల్ విస‌ర‌డంతో.. డెడ్‌లైన్ పూర్త‌యింద‌ని గుర్తు చేస్తూ వీడియోలు వైర్‌ల్ చేస్తున్నారు. ప్రాజెక్టును పూర్తి చేశారు కదా.. మ‌రి ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటూ ఎద్దేవా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో మంత్రి పై విధంగా స్పందించారు.

 

   ఈ ట్రోల్స్‌లో ముఖ్యంగా టీడీపీ నేతలు, తెలుగుదేశం అభిమానులు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌పై పై ట్రోలింగ్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.  మాజీ మంత్రి చినరాజప్ప ఈ స‌వాల్‌పై స్పందించి.. ట్విట్ట‌ర్ వేధిక‌గా పోస్ట్ చేశారు.  గోదావరి జిల్లాల్లో ఎటువంటి హంగు, ఆర్భాటం కనిపించటం లేదేంటి?.. పోలవరం ప్రారంభోత్సవం అని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌ గారు అసెంబ్లీ లో చెప్పారు. కానీ, మాకు ఆహ్వానం లేదేమో అనుకున్నా అని,  ఇంతకీ.. ఈ రోజు ఓపెనింగ్ ఉందా, లేదా అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్రోల్ చేస్తూ పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: