తీవ్రవాదులకు సహజంగా ఆయా సంస్థలు ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులలో సరిహద్దులలో పాక్ డ్రోన్ లతో ఆయుధాలను సరఫరా చేయడానికి చూస్తున్నట్టుగా కూడా అనేక దారులలో ఈ ఆయుధాలు స్లీపర్ సెల్స్ కు అందుతూ ఉంటాయి. వాటిని వాడి వాళ్ళు ఘాతుకాలకు పాల్పడటం సహజం. కానీ ఈ సరఫరాకు ప్రస్తుతం చాలా అవరోధాలు ఏర్పాటుడుతున్నాయని వాళ్ళు కూడా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. గతంలో పుల్వామా దాడిలో కూడా ఉగ్రభూతాలు వాడిన బాంబులు స్వయంగా తయారుచేసుకున్నవే తప్ప, ఎక్కడ నుండి వాళ్లకు సరఫరా చేయబడలేదు. దానికి వాళ్ళు ఆన్ లైన్ షాపింగ్ బాగా వాడుకుంటున్నారు. తద్వారా వాళ్ళు ఆయా రసాయనాలు తెప్పించుకొని, వాటితో కావాల్సిన ఆయుధాలను తయారుచేసుకుంటూ ఆయా ప్రాంతాలలో దాడులకు తెగబడుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు బాంబులు తయారీ దారులలో నైపుణ్యం ఉన్న తీవ్రవాద నేతలను వెతికిపట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టింది సైన్యం. ఆ వేటలో భాగంగా తాజాగా పుల్వామా లోనే అటువంటి నేత ఒకరు ఎదురుపడటం జరిగింది, వెంటనే వాళ్ళు కాల్పులకు దిగటంతో సైన్యం ఎదురుదాడి చేసి, ఆ నేతను హతమార్చగలిగింది. ఇటీవల ఇలాంటి వారి కోసం సైన్యం వేట ప్రారంభించింది. వీళ్లు ఆయుధాలు చేస్తుండటానికి కావాల్సిన ముడిపదార్దాల సేకరణ పై కూడా తగిన నిఘా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మొత్తానికి ఒకప్పుడు నక్సల్స్ ను వేటాడినట్టుగా ఇప్పుడు తీవ్రవాదులను, వాళ్ళ నాయకులను సైన్యం వేటాడి చంపేస్తుంది.

కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తరువాత అక్కడ ప్రశాంతత తేవడం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కాస్త దూరం తగ్గింది. దీనితో పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు కూడా భారత్ లో కలవాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగు పడాలని అనేక నిరసనలు చేస్తున్నది కూడా  చూస్తున్నాం. అయితే పాక్ ఈ నిరసనలకు తన అర్ధం  చెప్పుకుంటూ, వాళ్ళు పాక్ లో కలవాలని నిరసన చేస్తున్నట్టు చెప్పుకుంటుంది. ఇన్నాళ్లు పాక్ ప్రభావం ఉండటం వలన కాశ్మీర్ లో యువత చాలా మంది తీవ్రవాదం వైపుకు మళ్లింది, వాళ్ళను అడ్డుపెట్టుకొని ప్రస్తుతం అక్కడ శాంతిని విచ్చిన్నం చేయాలని కొన్ని తీవ్రవాద వర్గాలు చేస్తున్న ప్రయత్నాన్ని కేంద్ర, ప్రాంతీయ బలగాలు ఎప్పటికప్పుడు తిప్పుకోడుతూ, ఉన్న తీవ్రవాదులను తుదముట్టిస్తూ ముందుకు పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: