రష్యా చెప్పుకోవడానికి మరో పెద్దన్న తప్ప చెప్పుకోవడానికి ఒక ఉత్పత్తి లేదు. అంటే ఒక వస్తువు మేడ్ ఇన్ రష్యా అనేది ఎక్కడైనా చూశామా, ఒక్కచోట చూస్తాం, అదే ఏకే47, 203 లాంటి ఆయుధాలపై మాత్రమే. ఇది సాధారణంగా జరుగుతున్న ఉత్పత్తి. అంతకుమించి రష్యా దీనిపై ఇంతవరకు తన మనసు పోనీయలేదు ఎందుకనో మరి. ఆయుధాలు తప్ప ఒక్క సాధారణ ఉత్పత్తి రష్యా చేయకపోవడం పట్ల ఆ దేశం ఏమని అనుకుంటుందో ఏమో! ఎప్పుడు ఆయుధాలు అమ్ముకుంటూ మిగిలినవి మరిచిపోయిందేమో! ఇలా ప్రపంచవ్యాప్తంగా చివరికి తీవ్రవాదులు వాడినా లేక నక్సల్స్ వాడినా ఆయా ఆయుధాలు ఎక్కడివి అని చూస్తే, మేడ్ ఇన్ రష్యా అనే ఉంటాయి. ఆ స్థాయికి ఆయుధాలపై రష్యా దృష్టి పెట్టేసింది.

తాజాగా చైనా ఇతర దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చందాన రష్యా కూడా తన నుండి విడిపోయి స్వేచ్ఛగా బ్రతుకుతున్న దేశాలను మళ్ళీ తనదిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఉక్రెయిన్ విషయంలో ఆ దిశగా పావులు కదుపుతున్న రష్యా కు ఆ దేశం గట్టిగానే సమాధానం ఇచ్చింది. యూఎస్ఎస్ఆర్ కూడా దీనిపై రష్యా కు గట్టిగా హెచ్చరికలు జారీచేసింది. స్వేచ్ఛగా బ్రతికేస్తున్న పక్క దేశాలను తమదంటూ కల్పిచుకోవాలని చూస్తే, యూఎస్ఎస్ఆర్ లో దేశాలన్ని రష్యా పై విరుచుకుపడాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా కూడా దీనిపై స్పందించగా, రష్యా ఇది అంతర్గత విషయంగా చెప్పుకొచ్చినప్పటికీ, పరోక్షంగా మరో సమాధానం సిద్ధం చేసింది.

రష్యా తాజాగా భయంకరమైన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగం చేసింది. అది 11000 కిమీ లక్ష్యం వరకు అణు క్షిపణిని మోసుకెళ్లగలదు. దీనిని ప్రయోగించడం ద్వారా రష్యా, ఉక్రెయిన్ విషయంలో తనకు ఎవరైనా అడ్డు వస్తే ఊరుకునేది లేదని గట్టిగానే స్పష్టం చేసింది. అయితే ఈ హెచ్చరిక అమెరికాకు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్షిపణి దూరం గమనిస్తే అది ఖచ్చితంగా ప్రత్యేకంగా అమెరికా కోసమే తయారుచేసినట్టుగా ఉందని చెప్పేయొచ్చు. అంటే రష్యా పరోక్షంగా ఈ ప్రయోగం ద్వారా అమెరికా సహా పలు దేశాలకు హెచ్చరికలు జారీచేసింది. వీటిని చూపించి, రష్యా కూడా చైనా మాదిరిగా తన నుండి విడివడిన దేశాలను తిరిగి బలవంతంగా ఆక్రమించుకుంటుందా అనే కొత్త సమస్య తెరపైకి వచ్చింది. కోటి తాను చెడి ఊరుకోకుండా వనమెల్లా చెరిచిందని సామెత మాదిరి చైనా, తన ఆధిపత్య రోగాన్ని రష్యా కు ఘాటుగానే అంటించినట్టుగా ఉంది. జిన్ రష్యా అధ్యక్షుడికి బాగా బ్రెయిన్ వాష్ చేసినట్టుగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: