సాధారణంగా ఒక దేశంలో పరిస్థితులు బాగాలేకనో లేక ఆయా దేశాలలో జీవన ప్రణామాలు నచ్చక పోవడం వలననో లేక అక్కడ అనుకున్నంత స్వేచ్ఛ లేకపోవడం వలననో ప్రజలు వేరే దేశాలకు పర్యాటకులుగా వెళ్లి, చివరికి వాళ్లకు నచ్చిన దేశంలో స్థిరపడతారు. ఇలాంటి వారితో పెద్దగా సమస్యలు ఉండబోవు. కానీ ముందునుండి కుటిల బుద్దితో తమ దేశాన్ని వీడి, తమ ప్రణాళికలు అమలు చేయడానికి సమిదేలుగా బయలుదేరిన వారు కూడా శరణార్థులలో కలిసిపోయి ఆయా దేశాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్లు చాలా ప్రమాదం, ఎందుకంటే, దేశంలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తమ దేశానికి ఆయా సమాచారం ఇస్తూ, ఇక్కడ వాతావరణాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతుంటారు.

మొదటి నుండి కుట్రలతో వచ్చిన వారు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూసి, సరిగ్గా అప్పుడు తమకు అనుగుణంగా మార్చేసుకుంటారు. ఉదాహరణకు చిన్న మతఘర్షణ చోటుచేసుకుంటే, దానిని పెద్దదిగా చేసి, చివరికి ఆ ప్రాంతంలో మతఘర్షణలు పుట్టే విధంగా వీళ్లు వ్యూహాలు రచిస్తారు. తద్వారా అక్కడ ప్రజలలో కలిసి జీవించే తత్త్వం మెల్లిగా సన్నగిల్లుతుంది, అప్పుడు ఎవరు వస్తున్నది, ఎవరు వెళ్తున్నది పెద్దగా గమనించారు కాబట్టి ఈ పరిస్థితులలో తమ వారిని ఎక్కువ మందిని ఆయా ప్రాంతాలలోకి దింపవచ్చు. తద్వారా ఏదైనా పెద్ద ప్రదమకరమైనా సందర్భాన్ని రచించవచ్చు. ఇలాంటివి చేయడానికే శరణార్థుల పేరుతో ఇలాంటి వారు దేశాలను దాటి, ఎక్కడో ఎన్నో ఏళ్ళగానో నివసిస్తున్నారు.

ఇవన్నీ దశాబ్దాలుగా ఉగ్రభూతాలు పన్నిన ఉచ్చు అని ఆయా దేశాలకు తెలియడానికి సమయం పట్టింది. అందుకే ఇప్పటికే ఆయా దేశాలలో స్లీపర్ సెల్స్ స్థిరపడిపోయాయి. వాటికి అవసరం వచ్చినప్పుడు దాడులు చేస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఆయా దేశాలలో విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ప్రస్తుతం భారత్ లో కూడా ఇలాంటి వారి సంఖ్య బాగా ఎక్కువ అయినట్టు నివేదికలు చెపుతున్నాయి. వాళ్లపై చర్యలకు ఉపక్రమించడానికే కొత్త పౌర చట్టం తెస్తే దానిపై తీవ్రంగా విపక్షాలు యాగీ చేయడాన్ని చూశాం. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే అది ఖచ్చితంగా విపక్షాలకు చుట్టుకోక మానదు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో వీళ్లు స్థిరపడ్డారు, వాళ్లకు స్థానిక ఓటర్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఇచ్చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం తలమునకలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: