ఆంధ్రావ‌నిలో రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్కుతున్నాయి. మ‌ళ్లీ అని రాయ‌డంలో ఔన్న‌త్యం లేదు. కానీ రాయాలి. ఇప్పుడూ ఎప్పుడూ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ప‌రిణామాలే రాజకీయాల‌పై ఎన‌లేని ప్ర‌భావం ఒక‌టి చూపుతున్నాయి. ఆ క్ర‌మంలో ఆంధ్రావ‌నిలో రాజ‌కీయాలు కొన్ని సామాజిక వ‌ర్గాల చుట్టూ తిర‌గ‌డం త‌ప్పేం లేదు. అవును రెండంటే రెండు సామాజిక‌వ‌ర్గాలు రాజకీయాల‌ను శాసిస్తున్నాయి. అందుకే వాటిని నిర్దేశించేంత స్థాయి మిగ‌తా సామాజిక వ‌ర్గాల‌కు లేదు గాక లేదు. క‌నుక ఆ రెండు సామాజిక‌వర్గాల కొట్లాట‌లో ఆంధ్రావ‌ని నలిగిపోతోంది. విసిరి వేశారి పోతోంది. రాజ‌కీయం ఎలా ఉన్నా కూడా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు పలికే వ‌ర్గంలో ఇప్పుడు కొంత కాలం కింద‌ట లేరు క‌నుక ఇప్పుడు అని రాస్తున్నాను. ఇప్పుడు వంశీ ఇప్పుడు నాని ఉన్నారు. టీడీపీలో బ‌లీయ‌మైన గొంతుక‌లుగా ఉన్న వీరు చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గంకు చెందిన మ‌నుషులు.. ఇంకా వాళ్లే చెప్పుకున్న విధంగా తార‌క్ శిష్యులు కూడా! ఎందుకనో అక్క‌డి నుంచి వ‌చ్చాక తమ అధినేత‌ను అన‌రాని మాట‌లు అంటున్నారు.

ఇలా అన‌డం మంచిదా ముంచేదా లేదా ముందే అనుకుని ఓ వ‌ర్గం ఆ రీతిన అనిపిస్తుందా అన్న‌ది తేల్చ‌లేం. సినిమా నిర్మాత‌లుగా పేరున్న వీరు సినిమాను మించి రాజ‌కీయం న‌డుపుతుండ‌డ‌మే ఈ క‌థ‌లో భాగం. ఈ కథ‌కు ఆస‌క్తి కూడా! క‌నుక వంశీ మ‌రియు నానికి ఇంత‌టి స్వామి భక్తి ఎలా వ‌చ్చిందో ఒక్క‌సారి ఆ దేవ దేవుడే చెప్పాలి. లేదా ఎవ్వ‌రితోనో చెప్పిస్తాడ‌నుకోవాలి. లేదంటే దెబ్బ‌డి పోతాం.. కాదు కాదు వారి రాజ‌కీయాలే రేపో మాపో దెబ్బ‌డి పోతాయి. ఉన్న ప‌ళాన వీరిద్ద‌రూ జ‌గన్ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించి, జ‌గ‌న్ పార్టీ నుంచి వెళ్లిపోతే.. ప‌ర్ సపోజ్ అలానే జ‌రిగితే.. అప్పుడు రాజ‌కీయం ఏమౌతుంద‌ని.. ఎటు పోతుంద‌ని..అవ‌స‌రాలే రాజ‌కీయాల‌ను శాసిస్తాయి.. అవ‌సరాలే ప్రేమ‌ల‌ను నిర్ణ‌యించి కేసుల నుంచి ఆర్థిక నేరాల నుంచి ఆర్థిక లావాదేవీల నుంచి త‌ప్పిస్తాయి. అలాంటి అవ‌స‌రం వంశీకి ఉందో లేదో.. అలాంటి అవ‌స‌ర‌మే నానికి అవ‌సర‌మో కాదో తెలియ‌దు..


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp