స్వీయ నియంత్రణ లేదు
ఎవరు చెప్పినా వినమే అని అంటారు
అంటే ముఖ్యమంత్రి  చెబితే
ఆ మాట వేదం అని అంటూ
మిగిలిన వారంతా ఏమీ  కానివారని
తమ దృష్టిలో అని అంటూ తిట్టిపోస్తారా?


ఎవరు చెప్పినా ఎవ్వరూ కంట్రోల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి స్వీయ నియంత్రణ వారికి ఉంటూనే ఉంటుంది. దీనినే ఇంగ్లీషులో సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు. ఇదే ఇప్పుడు కొరవడి ఆ ఇద్దరూ సందర్భం ఉన్నా లేకపోయినా విపక్ష నేత చంద్రబాబును తిట్టిపోసి జగన్ ను ప్రశంసిస్తూ తమదైన రాజకీయం చేస్తున్నారు. ఈ చదరంగంలో గెలుపు ఓటముల తీరు ఎలా ఉన్నా ఆ ఇద్దరి నేతలను కంట్రోల్ చేయడం అన్నది జగన్ చేతిలో పని! ఆయన తరఫున ఓ చర్య ఉంటే చాలు. మిగతా పరిణామాలు అన్నీ సర్దుకుంటాయి. ఇప్పటిదాకా రాజకీయ వర్గాలలో ఉన్న అస్తవ్యస్తత కూడా కొంత తొలగిపోతుంది. కానీ సీఎం ఆ పని చేస్తారా?తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక హోదాలు అనుభవించి వెళ్లిపోయారు కొడాలి నాని మరియు వల్లభనేని వంశీ. పదవుల సంగతి ఎలా ఉన్నా ఆ ఇద్దరూ సినిమా వాళ్ల మనుషులుగానే ఎక్కువ గుర్తింపు పొందారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులుగా, ఆయన సినిమాలకు నిర్మాతలుగా ఆ ఇద్దరూ వ్యవహరించి, బాగానే సొమ్ములు పోగేశారు. ఎన్టీఆర్ నటించిన సాంబ చిత్రానికి మంత్రి కొడాలి నానీనే నిర్మాత. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయినా కూడా ఈ సినిమా కొడాలి కుటుంబం మునిగిపోయిందేమీ లేదు.


ఇక వంశీ నిర్మాతగా వచ్చిన అదుర్స్ మంచి టాక్ తెచ్చుకుని అంతకుమించిన వసూళ్లతో టాప్ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పుడిక ఆ ఇద్దరూ రుణపడిపోయింది ఎవరికి ఎన్టీఆర్ కే కదా! ఆ లెక్క చూసుకుంటే ఆ ఇద్దరూ ఎన్టీఆర్ కు ఆయన పరువుకూ ఇబ్బంది వచ్చే ఏ పనీ చేయకూడదు. చేయరు కూడా! నిన్నటి వేళ జరిగిందిదే! తాము ఎన్టీఆర్ చెబితే ఎందుకు కంట్రోల్ అవుతామని ఎదురు ప్రశ్న ఒకటి మీడియా ఎదుట ఆ ఇద్దరూ వేసి కొత్త డ్రామాకు తెరలేపారు.


వాస్తవానికి ఎన్టీఆర్ ఎంత  చెబితే అంత అన్న విధంగా ఉండే నానీ కానీ వంశీ కానీ ఉన్నట్టుండి సడెన్ రివర్స్ గేర్ ఎందుకు వేశారని? ఇందుకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయంగా భవిష్యత్ ను స్థిరం చేసుకునేందుకు వీరిద్దరూ తహతహలాడుతున్నారు. తమ ఉనికికి వైసీపీ నుంచి భరోసా రావడం  తదితర పరిణామాల రీత్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీలున్నంత మేర మాట్లాడుతూ మైలేజీ పెంచుకుంటున్నారు టీడీపీ వర్గాలలో! దీంతో ఆ ఇద్దరూ ఇంపార్టెంట్ అయ్యారు జగన్ కు...
మరింత సమాచారం తెలుసుకోండి: