కాంగ్రెస్ లో గాంధీల శకం ఇంకా కొనసాగుతోంది. ఇందిరాగాంధీ వారసుడు రాజీవ్ గాంధీ, ఆయన సతీమణి సోనియా గాంధీ, ఆ తరువాత రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ పగ్గాలను చేపట్టారు. కాంగ్రెస్ నాయకత్వం వారి నుంచి బయటకు వెళ్ళడంలేదు.

రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవీ రాజీనామా చేశారు. అయితే తాత్కాలిక ప్రెసిడెంట్ గా సోనియాగాంధీ ఈ రోజుకీ బాధ్యతలను చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని అంతా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కి నో ప్లేస్ అంటోంది బీజేపీయేతర విపక్షం.

కాంగ్రెస్ కి ఇక సీన్ లేదు, మద్దతు ఇచ్చి బుద్ధిగా పక్కన ఉండడమే అంటోంది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుండబద్ధలు కొట్టారు. యూపీయే ఎక్కడ ఉంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అంటే ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నది ఆమె ఆలోచన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచినా ఒక జాతీయ పార్టీగా అధికారం కోసం ఆ పార్టీ అసలు క్లెయిం చేయడానికి వీలు లేదన్నది మమత వంటి వారి మాటగా ఉంది.

మరి కాంగ్రెస్ దీన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. అసలు ఇంతకీ రాహుల్ గాంధీని ఎందుకు విపక్షాలు లైట్ తీసుకుంటున్నాయి అన్నది అర్ధం కాని విషయమే. విపక్షాలు ఆలోచనలు చూస్తే కనుక కాంగ్రెస్ కి రాహుల్ కి పెద్దగా ఫ్యూచర్ లేదని భావిస్తున్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. అదే నిజమైతే కాంగ్రెస్ ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలి. తన పెర్ఫార్మెన్స్ ని మెరుగుపరచుకోవాలి. లేకపోతే ఇంకా వెనక్కి నెట్టేస్తారు. ఇది నిజం. ఏది ఏమైనా ఒక గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉదాశీనంగా ఉండకుండా చురుకుదనం ప్రదర్శించాలి. అపుడే నెగ్గేది.

మరింత సమాచారం తెలుసుకోండి: