చంద్రబాబు టీడీపీ పగ్గాలను పాతికేళ్ళుగా మోస్తున్నారు. ఆయన ఎక్కడా తగ్గకుండా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏపీలో వైసీపీ దూకుడు రాజకీయం చెస్తున్నా ఈ వయసులో ఎదుర్కొంటున్నారు. అయితే బాబుకు టీడీపీ అతి పెద్ద సమస్య ఉంది.

పార్టీలో చాలా మంది ఇంకా చురుకుగా బయటకు రావడంలేదు. తానే అంతా అయి బాబు తిరుగుతున్నా కూడా పార్టీ దాన్ని క్యారీ చేసి మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోవడంతో ఏ పోరాటం చేపట్టినా ఎక్కడిది అక్కడే ఉండిపోతోంది.

ఈ నేపధ్యంలో  చంద్రబాబు ఇలా పని చేయని, పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడని వారిని పక్కన పెట్టేయాలి అనుకుంటున్నారుట. మొత్తం ఏపీ వ్యాప్తంగా అలా 175 నియోజకవర్గాల్లో ఇలా డల్ గా ఉన్న వారి జాబితాను బయటకు  తీస్తున్నారుట. పార్టీ కోసం ఈ రోజు పనిచేస్తేనే రేపటి ఎన్నికల్లో టికెట్ అన్నది బాబు విధానంగా ఉంది అంటున్నారు. ఇక జంప్ జిలానీలకు టికెట్లు ఇవ్వమని బాబు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.

అదే టైమ్ లో బాబు తో పాటే స్టార్టింగ్ నుంచి ఈ రోజు దాకా ఉన్న సీనియర్లకు చెక్ పెట్టేయాలని కూడా సెన్షేషనల్ డెసిషన్ ని బాబు తీసుకోబోతున్నారుట. ఆ విధంగా చూస్తే ఏపీలో పెద్ద ఎత్తున సీనియర్ల ముఖాలు వచ్చే ఎన్నికల వేళ కనిపించవు అంటున్నారు. వారంతా బాబుకు ఆప్తులు, అయితే వారికి కూడా పరిస్థితి వివరించి పార్టీ కోసమే ఇదంతా అని చెప్పడం ద్వారా వారిని ఒప్పించాలను చూస్తున్నారుట. ఇక వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి యూత్ తోనూ పనిమంతులతోనూ టీమ్ రెడీ చేసుకుంటున్నారుట బాబు. మొత్తానికి బాబు ప్రయోగం కనుక ముందుకు వస్తే టీడీపీ ఎపుడూ చూసే చాలా ముఖాలు ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం ఖాయమే అంటున్నారు. చూడాలి మరి బాబు డెసిషన్ గురించి తెలిసి పార్టీ  లీడర్స్ డల్ గా ఉండేవారు చురుకు పుట్టిస్తారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: