మన దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదైన కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటిలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించింది. అలాగే వారిపై 14రోజులు నిఘా పెట్టాలని చెప్పింది. మరోవైపు కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని.. ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని పేర్కొంది. ఇక మాస్కులు, శానిటైజర్ వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రం తెలిపింది.

నిన్నటి వరకు వేరే దేశంలో ఉన్న ఒమిక్రాన్ నేడు మన దేశంలోనూ గుర్తించారు. అది మన దగ్గరకు రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. మనం మరోసారి కంటికి కనబడని శత్రువుతో పోరాటం చేయాలి. సెకండ్ వేవ్ లో ఎంతో మంది ఆప్తులను కోల్పోయాం. ఆ చీకటి రోజులు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయమే అయినా.. భయపడొద్దని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అయితే ఒమిక్రాన్ చైన్ ను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందని.. అందుకు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. ప్రజలు ఒకే చోట చేరకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలంటోంది. శానిటైజ్ కూడా వాడాలంటోంది.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ పై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వహించొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. వేరియంట్లు సాధారణం అని.. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఈ వేరియంట్ 5రెట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుందన్నారు. తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. జనసమూహాలకు దూరంగా ఉండాలని..  వెంటిలేషన్ ఎక్కవగా ఉండేలా చూసుకోవాలన్నారు.

మరోవైపు దేశంలో బూస్టర్ డోసుగా కోవిషీల్డ్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత డ్రగ్ రెగ్యులేటర్ కు దరఖాస్తు చేసుకుంది. దేశంలో బూస్టర్ డోస్ పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్న తొలి కంపెనీగా ఎస్ఐఐ నిలిచింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా దేశంలో బూస్టర్ డోస్ వేసుకోవాలని చాలామంది ఆలోచిస్తుండగా.. ఇప్పటికే అనేక మంది ప్రైవేటుగా బూస్టర్ డోస్ వేసుకుంటున్నారు.











మరింత సమాచారం తెలుసుకోండి: