ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే.  ప్రశాంతం గా ఉన్న సరిహద్దుల్లో విస్తరణ వాత ధోరణి  తో వ్యవహరించిన చైనా ఏకంగా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఏకంగా చైనా భారత్ సరిహద్దు  లో సైనికుల మధ్య ఘర్షణ లతో మినీ సైజు యుద్ధమే జరిగింది అని చెప్పడం  లో అతి శయోక్తి లేదు. ఇక ఘర్షణల్లో అటు ఎంతోమంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే భారత్ చైనా సరిహద్దుల్లో అటు సైనికాధికారులు ఎన్నిసార్లు సమావేశమై చర్చించి ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ అటు చైనా మాత్రం ఎప్పుడు సరిహద్దులో డబుల్ గేం ఆడుతు వస్తుంది అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి మరోసారి సరిహద్దుల్లో పరిస్థితులు ఎంతో హాట్ హాట్ గా మారిపోయాయి. భారత్-చైనా మధ్య ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది.. ఇక ఇరు దేశాలు కూడా భారీగా యుద్ధ విమానాలను ఆయుధాలను సైనికులను మోహరించడం  చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే మరోసారి సరిహద్దుల లో భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదాలకు పరిష్కారానికి ఏకం గా రెండు దేశాల ఉన్నతాధికారులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.. ఈ నెల రెండవ వారం లో భారత-చైనా భద్రతాధికారులు పద్నాలుగవ సారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈసారి  చర్చల కోసం ఆహ్వానం చైనా నుంచి అందిందని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతు ఉండటం గమనార్హం. ఎల్వోసీ వెంబడి ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఇప్పటికే ఏకం గా 13 సార్లు భారత్-చైనా మధ్య చర్చలు జరిగినప్పటికీ విఫలం అవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.మరి సరిహద్దుల్లో చర్చలు ఈసారైనా విజయవంత  మవుతాయా లేక మునుపటి లాగానే విఫలం అవుతాయన్నది హాట్ టాపిక్ గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: