తాజాగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జరిగిన ఘటనలు పార్లమెంట్ సభలలో చర్చకు వచ్చాయి. దీనితో దేశంలోని ఆయా డ్యామ్ ల విషయమై బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. 2019 లో ఈ బిల్లు తెచ్చినప్పటికీ ఇప్పుడు దానిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆయా డ్యామ్ ల ను నిరంతరం పర్యవేక్షించడం అవసరం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనితో ఈ బిల్లు ఆమోదం పొందటం అవసరం అని అందరు భావిస్తున్నారు. తాజాగా బాధిత రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం బిల్లు కు అనుకూలంగా ఉంటె, ఇతర బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు మాత్రం అభ్యన్తరాలు చెపుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో ఈ బిల్ ఆమోదం పొందింది.

ఇటీవల ఎన్నడూ లేని వర్షపాతం చూడటం జరిగింది. దీనితో అనేక ప్రాంతాలు నీటమునిగి పోయాయి. కొన్ని చోట్ల డ్యామ్ లు నీటిప్రవాహాన్ని తట్టుకోలేక బద్దలవడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీనితో డ్యామ్ ల పర్యవేక్షణపై ప్రభుత్వాలకు ఆలోచన వచ్చింది. సాధారణంగా ఆయా డ్యామ్ లకు తగిన విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఏదైనా డామేజ్ జరిగిందా, ఎక్కడైనా సాధారణ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నదా లాంటి విషయాలు చూసుకోవాల్సి వస్తుంది. కానీ మనవళ్ల నిర్లక్ష్యం తెలిసిందే కాబట్టి, అంతా మునిగాక ఇప్పటికి తేరుకుని బిల్లు గురించి చర్చ లేవనెత్తారు.

ఇందులో కూడా కొందరు ఒప్పుకోకుండా ఉండటం విచిత్రం. ఈ బిల్లు పరిధిలో 10-15 అడుగులు ఎత్తు ఉన్న డ్యామ్ లు వస్తాయి, వీటి నిరంతర పర్యవేక్షణ కేంద్రం బాధ్యత అన్నమాట. అదేదో చిత్రంలో చెప్పినట్టుగా, అధికారం ఉంది కదా అని డ్యామ్ లకు కావాలనే వీక్ రిపోర్ట్ ఇచ్చి, వాటిని పడగొట్టి కొత్తవి కట్టడం లాంటి ఆలోచనలకు ఇది ఆర్జమ్ పోయకుండా ఉంటె చాలు. వరదలు రావడానికి ముందే ఇలాంటివి పూర్తిచేసి, తగిన విధంగా వాటిని సిద్ధం చేసుకుంటూ ఉండటం కనీస బాధ్యత. కానీ అంతా పోయాక ఇప్పుడు బిల్లు గురించి చర్చ, అది అమలు కావడానికి ఎంత సమయం పడుతుందో మరి! చూడాలి ఇందులో ఈ నేతలకు ఎంత లాభం ఉందో అని, వాళ్లకు లేకుండా బిల్లు రూపొందటం కష్టం కదా మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: