ఇండియాలోకి సైతం ఒమిక్రాన్ వచ్చేసింది.. ఇప్పుడు ఇదే హాట్ న్యూస్.. దాదాపు 30 దేశాల్లోఈ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ పాకేసింది.. వారం రోజుల క్రితం దక్షిణ ఆఫ్రికాలో వెలుగు చూసిన ఈ ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 300 వరకూ లెక్క తేలాయి. ఇది డెల్టా కంటే చాలా వేగంగా వ్యాపించే వేరియంట్ అని తేలడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. హడావిడి పడిపోతున్నాయి. ఈ ఒమ్రికాన్ వేరియంట్ విదేశాల్లో ఉన్నప్పుడు చాలా భయపడిపోయిన ఇండియన్లు.. ఇప్పుడు ఏకంగా ఇండియాలోనే రెండు కేసులు నమోదయ్యాయని తేలడంతో కంగారు పడిపోతున్నారు.


అయితే.. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. ఈ ఒమిక్రాన్ వేరియట్ డెల్టా కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాపించేది అయినా ఇండియన్లు అంతగా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈ ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నమాట వాస్తవమే అయినా.. అలా వేగంగా వ్యాపించడం వల్ల వచ్చిన నష్టం పెద్దగా ఉండటం లేదు. ఈ ఒమ్రికాన్ వేరియంట్ సోకిన వాళ్లలో ఇప్పటి వరకూ తీవ్రమైన కరోనా లక్షణాలు ఎవరిలోనూ కనిపించలేదు. మరి తీవ్రమైన లక్షణాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేనప్పుడు ఈ ఒమ్రికాన్ వేరియంట్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం కనిపించడం లేదు.


ఈ ఒమ్రికాన్ వేరియంట్ కారణంగా ప్రాణాలు పోతున్నట్టు ఎక్కడా కేసులు కనిపించడం లేదు. అలాంటప్పడు  అది వేగంగా వ్యాపిస్తే మాత్రం వచ్చిన నష్టమేంటి.. మనలో చాలా మందికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి తరచూ వస్తూనే ఉంటాయి. ఈ ఒమ్రికాన్ కూడా అలాంటిదే అవుతుంది తప్ప.. దీంతో భయపడాల్సిన పని ఏముంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ఒమ్రికాన్ వేరియంట్ ప్రాణాంతకం అన్న విషయమైతే కచ్చితంగా నిర్థారణ జరగలేదు. అందువల్ల ఈ ఒమ్రికాన్ వేరియంట్ గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: