కరోనా వైరస్ ప్రపంచాన్ని వదిలి పెట్టడం లేదు. రూపాంతరం చెందుతూ పట్టి పీడిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు మళ్లీ భయం లోకి నేడుతూనే ఉంది. ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ లు ప్రపంచ దేశాలపై పంజా విసిరాయి. దీంతో ఇక అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ ప్రభావం తో అల్లాడి పోయాయి అనే విషయం తెలిసిందే. చిన్న దేశాలు మాత్రమే కాదు అగ్రరాజ్యాల సైతం  వైరస్ ప్రభావం కారణంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాయి చెప్పాలి.. అయితే ఇక రెండు దశల కరోనా వైరస్ ను ప్రపంచ దేశాలు అతి కష్టం మీద కట్టడి చేయగలిగిగాయ్. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు .



 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగా కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తుంది.. ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తుంది  అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయం పట్టుకుంది. ఇక ఈ వైరస్ ఎంతో ప్రమాదకారి అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ దేశాలు హెచ్చరించింది. ఇక ఈ కొత్త వేరియంట్ పై వ్యాక్సిన్లు ఎంత మేరకు పనిచేస్తాయి అన్నదానిపై కూడా ఇవ్వడం లేదు శాస్త్రవేత్తలు . దీంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా అన్ని దేశాలు మళ్లీ లాక్డౌన్ లో కి వెళ్ళి పోతూ ఉండటం గమనార్హం.



 ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వేరియంట్ ఓమిక్రాన్  ముందుగా సౌతాఫ్రికాలో బయట పడింది అని అందరూ భావించారు. కానీ సౌత్ ఆఫ్రికా కంటే ముందే యూరప్లో కొత్త వేరియంట్ కనిపించింది అనేందుకు ప్రస్తుతం ఆధారాలు బయట పడుతూ ఉండటం గమనార్హం.. సౌత్ ఆఫ్రికా కంటే ముందే నెదర్లాండ్ బెల్జియం జర్మనీ దేశంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయట. ఈ కొత్త వేరియంట్ కు  సంబంధించిన కేసులు గుర్తించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు పదకొండు యూరప్ దేశాల పరిధిలో ఏకంగా నలభై నాలుగు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: