ఆగ్నేయ బంగాళాఖాతమున‌కు ఆనుకొని ఉన్న అండ‌మాన్ స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా బ‌ల‌ప‌డింది. విశాఖ‌కు 960 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన ఈ వాయుగుండం మ‌రింత‌గా బ‌ల‌ప‌డి ఇవాళ మ‌ధ్య బంగాళ‌ఖాతంలో జ‌వాద్ తుఫాన్‌గా మార‌నున్న‌ది. ఈ జ‌వాద్ తుఫాన్ తో రెండ్రోజుల వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర‌లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని విశాఖ తుఫాన్ హెచ్చ‌రిక‌ల కేంద్రం హెచ్చ‌రించిన‌ది. మ‌త్య్స కారులు ముఖ్యంగా శుక్ర‌వారం నుంచి సోమ‌వారం వ‌ర‌కు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని.. ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చిరిక‌లు జారీ చేస్తున్నారు అధికారులు. ఇప్ప‌టికే ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమల‌లో మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ తుఫాన్ కార‌ణంగా దాదాపు 95 రైళ్లు ర‌ద్ద‌య్యాయని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ ప్ర‌క‌టించిన‌ది.

అదేవిధంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ‌కు కూడా జ‌వాద్ తుఫాన్ టెన్ష‌న్ ప‌ట్టుకున్న‌ది. గంట‌కు  100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉన్న‌ద‌ని, గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు.  ముందస్తు చర్యల్లో భాగంగా  ఇప్ప‌టికే ప‌లు కీలక నిర్ణయాలను  తీసుకున్నారు అధికారులు. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆ ప్రాంతాల్లో నిలిపివేయాలని నిర్ణయించారు.  సమస్య తలెత్తిన సబ్ స్టేషన్‌లు, ఫీడర్లు మరమ్మత్ ల‌ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోడానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్లు  ఏర్పాటు చేసారు.

అయితే జ‌వాద్ తుఫాన్ గా వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనున్న‌ది. శనివారం ఉదయం వ‌ర‌కు ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుంటుంద‌ని,  అక్కడ నుంచి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది అని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన‌ది. అయితే జ‌వాద్ తుఫాన్ పొంది ఉన్న త‌రుణంలో ఒడిషా ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్త‌మై.. తీర ప్రాంత జిల్లాల‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఎన్‌డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్‌తో కూడిన 266 బృందాల‌ను ఇప్ప‌టికే రంగంలోకి దించి సిద్ధంగా ఉంచిన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: