ప్ర‌పంచాన్ని రెండు సార్లు అత‌లాకుతలం చేసిన క‌రోనా వైర‌స్ మ‌రోసారి తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఓమిక్రాన్ రూపంలో ముప్పు పొంచి ఉంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయ‌ని, ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్ఓ దేశాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ది. భార‌త్ విల‌య‌తాండవం సృష్టించిన క‌రోనా డెల్టా వేరియంట్ క‌న్నా ఓమిక్రాన్ 6 రెట్లు వేగంగా విస్త‌రిస్తోందని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసారు.

మొద‌టిసారిగా ద‌క్షిణాఫ్రికాలో గుర్తించిన ఓమిక్రాన్ వేరియంట్ నెల తిరక్కుండానే ఇప్ప‌టికే చాలా దేశాలకు విస్తరించింది. తాజాగా భారత్‌లోనూ ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న‌ది. 
బెంగళూరులో రెండు ఓమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు కేంద్రం అధికారిక ప్రకటన చేసిన‌ది. హైదరాబాద్‌లోనూ రెండు రోజుల కిందట ఓమిక్రాన్ కలకలం రేగిన‌ది. ఇప్ప‌టికే విదేశాల నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు ఓమిక్రాన్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఆమె నుండి శాంపిల్స్ సేక‌రించి మ‌హారాష్ట్రలోని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఆమెకు సోకింది క‌రోనా డెల్టా వేరియంట్ లేక ఓమిక్రాన్ వేరియంట్ అనే విష‌యంలో స్ప‌ష్ట‌త రావాల్సి ఉన్న‌ది.  

ఇంత‌లోనే క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసే మ‌రో ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌ని విదేశాల నుంచి హైద‌రావ‌బాద్  ఎయిర్‌ఫోర్ట్‌కు వ‌చ్చిన వారిలో 13 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలిన‌ది. దీంతో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓమిక్రాన్  వైర‌స్ నేప‌థ్యంలో విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లో 13 మందికి పాజిటివ్‌గా తేలింద‌ని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే పాజిటివ్ వ‌చ్చిన వారిని గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారి నుంచి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. క‌రోనా సోకిన వారికి వేరియంట్‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉన్న‌ది. రిపోర్టు రావ‌డానికి రెండు నుంచి మూడు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యాధికారులు

మరింత సమాచారం తెలుసుకోండి: