ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రస్తుతం దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఇలా ఎలా వ్యవహరిస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు అర్చకులు. ఇందుకు ప్రధాన కారణంగా దేవాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులే. అర్చకులకు స్కేల్ ఇచ్చి ఉన్నాం. అందువల్ల ప్లేట్ కలెక్షన్ రద్దు చేయడం అయినది.. అంటూ అన్ని దేవాలయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు బోర్డులు పెట్టడంపై  అర్చకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలా బోర్డులు పెట్టడం ద్వారా అర్చకులను అవమానిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అర్చకులకు హిందూ ధార్మిక సంఘాలు కూడా తోడయ్యాయి. ప్రభుత్వం ఈ విధంగా బోర్డులు పెట్టడం మండిపడుతున్నారు కూడా. దేవాలయాల్లో అర్చకులకు ప్రభుత్వం వేతనం ఇస్తుంది... కాబట్టి భక్తులు అర్చకులకు ఎలాంటి సంభావన ఇవ్వకూడదు అంటూ దేవాదాయ శాఖ చేస్తున్న ప్రకటన అర్థం. ఇలా బోర్డు పెట్టడం వల్ల అర్చకులను ప్రభుత్వం అవమానిస్తోందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు పూజారులు.

అర్చకులు చేసే పూజలపై సంతృప్తి చెందిన భక్తులు... వారికి సంభావన ఇస్తారన్నారు. మూల విరాట్‌కు అర్చకులు చేసే సేవలకు అనుగుణంగానే భక్తులు గుడికి వస్తున్నారని... అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నారు. ఆలయాల అభివృద్ధికి భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తారని... అవి అర్చకులకు చేరడం లేదన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని ఆరోపించారు. అలాంటిది... భక్తులపై కూడా సంభావన, దక్షిణ  చెల్లించ వద్దంటూ ఎలా ఆంక్షలు విధిస్తారని ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. ఆలయాలు అనేవి ధార్మిక కేంద్రాలే తప్ప.... ప్రభుత్వ కార్యాలయాలు కావన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు కూడా వేతనాలు చెల్లించాలని, అలాగే సమయ పాలన కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న సెలవులతో పాటు అన్ని సౌకర్యాలు తమకు కూడా కల్పించాలని... లేదంటే ఆలయాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అర్చకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: