వైసీపీని ఓడించడం కష్టామా సులువా. ముందు ఈ సంగతి తేలాలి. అది కనుక తేల్చుకుంటే యుద్ధం చేయడం తేలిక అవుతుంది. ఎత్తులు పై ఎత్తులు వేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఇపుడు అదే పనిని తెలుగుదేశం పార్టీ చేస్తోంది.

వైసీపీ కానీ జగన్ కానీ గత రెండున్నరేళ్లలో ఆడిన మైండ్ గేమ్ కానీ చాణక్య రాజకీయం కానీ చూసుకుంటే టీడీపీకి అదే పెద్ద దెబ్బగా మారింది. అదెలా అంటే వైసీపీ 151 సీట్లతో కడు బలంగా అధికారంలోకి వచ్చింది. దాంతోనే టీడీపీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బ తింది. ఈ సర్కార్ ని నిలువరించడం, ఓడించడం కష్టం అన్న భావన ఏర్పడింది. దానికి తోడు జగన్ ముప్పయ్యేళ్ళ సీఎం. ఒక్కసారి కుర్చీ ఎక్కితే మరి దిగే చాన్స్ ఉండదని వైసీపీ నేతలు గేమ్ మొదలెట్టారు.

అదే విధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. దాంతో మొత్తానికి మొత్తం టీడీపీ శ్రేణులు చతికిలబడ్డాయి. అయితే వైసీపీని ఓడించడం ఈజీవే అంటున్నారు అధినేత చంద్రబాబు. ఆయన తాజాగా పార్టీ నాయకులతో మాట్లాడుతూ వైసీపీని అధికారంలో నుంచి దించడం కష్టమనుకోవద్దని క్యాడర్ కి హితబోధ చేస్తున్నారు.

లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహపడవద్దు అని కూడా సూచిస్తున్నారు. అసలు ఎన్నికలు వేరేలా జరుగుతాయని, ఆ ఎన్నికలు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. అందువల్ల క్యాడర్ అంతా ఐక్యంగా ఉండాలని, నిబద్ధతతో పనిచేస్తే వైసీపీకి ఓటమి ఖాయమని ఇక ఆ పార్టీ  ఇంటికే అని కూడా బాగా నూరిపోస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఇపుడు క్యాడర్ ని ఉత్తేజపరుస్తున్నారు. ఎక్కడ లోపం ఉందో సరిచేస్తున్నారు. దాంతో వారు రీచార్జి అయినట్లు అయితే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవు. దాంతో ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ రూపొందించుకోవాలి మరి.






మరింత సమాచారం తెలుసుకోండి: